Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

వేములవాడ, డిసెంబరు 3: దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం శుక్రవారం భక్తులతో రద్దీగా మారింది. కార్తీక మాసం చివరి శుక్రవారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు, ధర్మదర్శనం, శ్రీఘ్ర దర్శనం ద్వారా అలయంలోకి చేరుకొని తమ ఇష్టదైవమైన రాజారాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.  స్వామివారికి  ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు.  స్వామివారి నిత్య కల్యాణం, సత్యనారయణ వ్రతం వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించారు.   భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. 


Advertisement
Advertisement