Advertisement
Advertisement
Abn logo
Advertisement

ిక్కిరిసిన రాజన్న క్షేత్రం

వేములవాడ, డిసెంబరు 6 : వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దివ్యక్షేత్రం సోమవారం భక్తజనంతో కిక్కిరిసింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక ్తజనం  తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుని తరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు  స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. స్వామివారి నిత్య కల్యాణం, కుంకుమ పూజ వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. కల్యాణకట్టలో పెద్ద సంఖ్యలో భక్తులు తలనీలాలు సమర్పించారు. సోమవారం సందర్భంగా లఘుదర్శనం అమలు చేశారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో  స్వామివారి దర్శనానికి రెండు గంటలు, కోడెమొక్కు చెల్లింపునకు మూడు గంటలకు పైగా సమయం పట్టింది. దేవస్థానానికి అనుబంధంగా ఉన్న  బద్దిపోచమ్మ ఆలయం బోనం చెల్లించే భక్తులతో రద్దీగా మారింది.  ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. 

రాజన్న సేవలో ఎమ్మెల్యే సీతక్క

ములుగు ఎమ్మెల్యే సీతక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ  రాజరాజేశ్వరస్వామిని సోమవారం కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఆలయ మాజీ చైర్మన్‌ ఆది శ్రీనివాస్‌ ఆమె వెంట ఉన్నారు.  వరంగల్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి కుటుంబ సభ్యులతో కలిసి  రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 

Advertisement
Advertisement