తీవ్ర ఉష్ణోగ్రతను తట్టుకునే గోధుమ వంగడాలు

ABN , First Publish Date - 2021-01-18T07:23:27+05:30 IST

అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లోనూ దీర్ఘకాలం పాటు మనగలిగే గోధుమ వంగడాల అభివృద్ధిపై హిమాచల్‌ప్రదేశ్‌లోని

తీవ్ర ఉష్ణోగ్రతను తట్టుకునే గోధుమ వంగడాలు

అభివృద్ధిపై దృష్టిసారించిన సీఎ‌స్‌ఐఆర్‌- ఐహెచ్‌బీటీ 


న్యూఢిల్లీ, జనవరి 17 : అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లోనూ దీర్ఘకాలం పాటు మనగలిగే గోధుమ వంగడాల అభివృద్ధిపై హిమాచల్‌ప్రదేశ్‌లోని ‘కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ - ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ బయోరిసోర్స్‌ టెక్నాలజీ’ (సీఎ్‌సఐఆర్‌- ఐహెచ్‌బీటీ) శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావంతో గోధుమ పంటల నుంచి లభించే ఫలసాయం గణనీయంగా తగ్గుతుందని, ఈ పరిణామం ఆహార సంక్షోభానికి దారితీయొచ్చని వారు హెచ్చరించారు. ఈవివరాలతో కూడిన నివేదిక ‘జెనోమిక్స్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది. 

Updated Date - 2021-01-18T07:23:27+05:30 IST