అన్నదాతకు సాగు భారం!

ABN , First Publish Date - 2021-06-21T06:47:52+05:30 IST

జిల్లాలో వానాకాలం సాగు మొదలైంది. జూన్‌ ఆరం భం నుంచి వర్షాలు కురుస్తుండడంతో రైతులు విత్తనా లు వేస్తున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో 5ల క్షల 6 వేల ఎకరాలలో పంటలు సాగవుతాయని వ్యవ సాయశాఖ అధికారులు అంచనా వేశారు.

అన్నదాతకు సాగు భారం!

జిల్లా రైతాంగానికి పెరిగిన పెట్టుబడి భారం

విత్తనాలు, కూలీలకు పెరిగిన ధరలు 

బ్యాంకుల నుంచి మొదలు కాని రుణాలు

రైతుబంధు అందినా ప్రైవేటు అప్పుల కోసం రైతుల చూపు

నిజామాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వానాకాలం సాగు మొదలైంది. జూన్‌ ఆరం భం నుంచి వర్షాలు కురుస్తుండడంతో రైతులు విత్తనా లు వేస్తున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో 5ల క్షల 6 వేల ఎకరాలలో పంటలు సాగవుతాయని వ్యవ సాయశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో ఇ ప్పటివరకు పసుపు, సోయా, మొక్కజొన్న, కంది, పెస ర పంటలతో పాటు వరి నాట్లు వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు లక్షా యాభై వేల ఎకరాలకుపైగా పంట లు వేశారు. కరుస్తున్న వర్షాలను బట్టి రైతులు పంటల ను సాగుచేస్తున్నారు. జిల్లాలోని వర్ని, రుద్రూరు మం డలాల పరిధిలో వరి నాట్లు వేస్తుండగా ఇతర మండ లాల్లో నారు మడులను సిద్ధం చేస్తున్నారు.

ఈ యేడు రైతులపై అధిక భారం

జిల్లాలో వానాకాలం సాగు రైతులపైన అధికభారం మోపుతోంది. ఈ యేడాది విత్తనాలపై సబ్సిడీ ఎత్తివే యడంతో రైతులపైన అదనపు భారం పడింది. సోయా బీన్‌ విత్తనాల బ్యాగును సబ్సిడీతో రూ.1,100 నుంచి రూ.1,300లోపు ధరకు కొనుగోలు చేయగా.. ఈ వానా కాలంలో రూ.3వేల నుంచి రూ.3,500ల వరకు వెచ్చిం చారు. వరితో పాటు ఇతర విత్తనాలకు కూడా రేట్లు పె ంచడంతో రైతులపై అధికభారం పడింది. కరోనాతో కూ లీల రేట్లు కూడా పెరిగాయి. గతంలో విత్తనం, పొలం పనుల కోసం రోజుకు రూ.500లు ఇవ్వగా ప్రస్తుతం రూ.600 నుంచి రూ.700వరకు పెడుతున్నారు. పసు పు వేసేందుకు ఇంకా ఎక్కువ మొత్తంలో వెచ్చిస్తున్నా రు. కేంద్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచడం తో ఆ ప్రభావం వ్యవసాయంపై పడింది. డీజిల్‌ రేట్లు పెరగడం వల్ల ట్రాక్టర్‌ యజమానులు దుక్కులు దున్నే ందుకు రేట్లు పెంచారు. గతంలో చెలక దున్నేందుకు గంటకు రూ.800 నుంచి రూ.900 వరకు తీసుకునేవా రు. ప్రస్తుతం రూ.1,100 నుంచి రూ.1,300 వరకు తీసు కుంటున్నారు. పొలం దున్నేందుకు గతంలో ఎకరాకు ఒకసాలు కోసం రూ.600 నుంచి రూ.700ల వరకు తీ సుకోగా.. ఈ వానాకాలంలో రూ.700 నుంచి రూ. 800 మధ్య తీసుకుంటున్నారు. వరి నాట్లకు కూడా ధర పెరి గింది. గత సంవత్సరం ఎకరాకు రూ.4,500 వరకు తీ సుకోగా.. ప్రస్తుతం రూ.5,500 వరకు తీసుకుంటున్నా రు. ఒకేసారి అన్ని రేట్లు పెరగడంతో రైతులు పెట్టుబ డులకు ఇబ్బందులు పడుతున్నారు. 

రైతుబంధు అందినా.. ఇబ్బందులే..!

ఈ వానాకాలంలో దుక్కులు దున్నేందుకు, విత్తనాల కొనుగోలు, కూలీల వరకే ఎకరాకు గత సంవత్సరం కం టే రూ.1,500 నుంచి రూ.2వేల వరకు అదనపు భారం పడుతోంది. రైతులకు ప్రభుత్వం నుంచి ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతుబంధు అందుతున్నా పెరిగిన ధరల తో పెట్టుబడులకు సరిపోవడం లేదు. వానాకాలం ఆర ంభం కావడంతో ఎరువులు, పురుగుల మందుల కొను గోలుకు డబ్బుల అవసరం పెరిగింది. గత సంవత్సరం లాగా ఈ యేడు బ్యాంకుల నుంచి రుణాలు కూడా ఇ వ్వడంలేదు. జిల్లా రుణా ప్రణాళికను ఇంకా ఖరారు చే యలేదు. బ్యాంకులకు కొత్త రుణాలు ఇవ్వాలని లక్ష్యాల ను నిర్ణయించలేదు. ఉన్నతాధికారుల నుంచి ఆదే శా లు రాకపోవడంతో కొన్ని బ్రాంచ్‌లలో మినహా ఇతర శాఖలలో రుణాలు ఇవ్వడం లేదు. కరోనాతో కొన్ని బ్యా ంకులలో వాయిదా వేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఎత్తివే యడం వల్ల కొత్త రుణాలపై ఈనెల 23న జరిగే సమా వేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రైతులు మాత్రం పెట్టుబడుల కోసం వ్యాపారులు, ఇతరుల ను ంచి అప్పులు తెచ్చు కుంటున్నారు. బ్యాంకుల నుంచి రుణాల పంపిణీ మొదలు పెడితే ఉపయోగం ఉంటుం దని రైతులు కోరుతున్నారు. పెట్టుబడుల కోసం తప్పని సరి రుణాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. జిల్లా లీ డ్‌ బ్యాంకు అధికారిగా నాగ శ్రీనివాస్‌ శనివారమే బా ధ్యతలు తీసుకున్నందున్న సమావేశం కాగానే లక్ష్యాల కు అనుగుణంగా రుణాలు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలు ఇ స్తామని కొన్ని బ్రాంచ్‌ల బ్యాకు అధికారులు తెలిపారు. గత సంవత్సరం వానాకాలంలో రూ.2,054 కోట్లు లక్ష్యం గా నిర్ణయించగా.. రూ.1,315 కోట్లు మాత్రమే ఇచ్చారు. యాసంగి లో రూ.1,368 కోట్లకు గాను రూ.1,162 కోట్లు రుణాలుగా రైతులకు అందించారు.

ఈ యేడాది పెట్టుబడి బాగా పెరిగింది..

నామాల జానకి రామయ్య, వర్ని

ఈ యేడాది పంటలకు పెట్టుబడి బాగా పెరిగి ంది. గత సంవత్సరం కంటే కూలీల రేట్లు పెరిగా యి. మగవారు రూ.750 తీసుకుంటున్నారు. డీజిల్‌ ధరలు పెరగడంతో ఎకరం భూమి దున్నడానికి ట్రాక్టర్‌కు రూ.3వేల వరకు పెంచారు. విత్తనాలు,  ఎరువుల ధరలతో ఎకరాకు రూ.2వేల వరకు అద నపు భారం పడుతోంది. 

బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు..

జి.కిషన్‌ రెడ్డి, పెద్ద వాల్గోట్‌, సిరికొండ

జిల్లాలో రైతులు పంటలు వేస్తున్నా.. బ్యాంకుల నుంచి రుణాలు ఇంకా ఇవ్వడం లేదు. బయట అప్పు పుట్టడం లేదు. ఇచ్చినా ఎక్కువ మొత్తంలో వడ్వి తీసుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితులలో ప్రైవేటు వ్యక్తుల వద్ద వడ్డీ ఎక్కువైనా అప్పుతె చ్చుకుంటున్నాం. అన్ని ధరలు పెరగడంతో రైతుకు పెట్టుబడి పెరిగింది.

Updated Date - 2021-06-21T06:47:52+05:30 IST