రైతులకు కేటాయించిన భూముల్లో సాగు చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-06-23T05:47:40+05:30 IST

రైతులకు కేటాయించిన భూముల్లోనే సాగు చేసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ప్రభుత్వ భూములను పాడేరు ఆర్డీవో లక్ష్మీశివజ్యోతితో కలిసి జేసీ పరిశీలించారు.

రైతులకు కేటాయించిన భూముల్లో సాగు చేసుకోవాలి
కొత్తభల్లుగుడలో ప్రభుత్వ భూమిని పరిశీలిస్తున్న జేసీ వేణుగోపాలరెడ్డి


జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి


అరకులోయ, జూన్‌ 22: రైతులకు కేటాయించిన భూముల్లోనే సాగు చేసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ప్రభుత్వ భూములను పాడేరు ఆర్డీవో లక్ష్మీశివజ్యోతితో కలిసి జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్తభల్లుగుడ పంచాయతీ పరిధిలోని ప్రధాన రహదారికి ఆనుకొని  72,73 సర్వే నంబర్‌ పరిధిలో ఉన్న 95 ఎకరాల ప్రభుత్వ భూమిని  పరిశీలించారు. ఈ రెండు సర్వే నంబర్ల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమి స్థితిగతులను తహసీల్దార్‌ శ్యాంప్రసాద్‌, పాడేరు డివిజన్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ ప్రసాద్‌ వివరించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజన రైతులు జేసీతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా తాము ఆ భూముల్లో సాగు చేసుకుంటున్నామని చెప్పారు. దీనిపై జేసీ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు కేటాయించిన భూముల్లో మాత్రమే సాగు చేసుకోవాలని, ప్రభుత్వ భూముల్లో ఎలా సాగు చేస్తారన్నారని రైతులను ప్రశ్నించారు. రైతులు, గ్రామస్థులకు ఉపయోగపడే పనులకే ఈ భూములను వినియోగిస్తామన్నారు. అంతకుముందు బొండాం పంచాయతీ పరిధిలోని మజ్జివలస సర్వే నెంబర్‌ 54లో ఏకలవ్య గురుకుల స్కూలు నిర్మాణానికి కేటాయించిన 15 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఈ సర్వే నంబర్‌లో ఉన్న ప్రభుత్వ భూమి వివరాలను తహసీల్దార్‌ శ్యాంప్రసాద్‌ వివరించారు. వారి వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.  

Updated Date - 2021-06-23T05:47:40+05:30 IST