ఆర్టీసీకి కర్ఫ్యూ ఎఫెక్ట్‌..

ABN , First Publish Date - 2021-05-18T05:13:10+05:30 IST

కరోనా కర్ఫ్యూ ఎఫెక్ట్‌తో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి పడింది. సెకెండ్‌ వేవ్‌ ప్రారంభం అయ్యాక ప్రభుత్వం కర్ఫ్యూ విఽధించిన నేపథ్యంలో డిపో నుంచి ఉదయం వెళ్లిన బస్‌లు మళ్లీ 12 గంటలోపు డిపోకు చేరిపోవాలి.

ఆర్టీసీకి కర్ఫ్యూ ఎఫెక్ట్‌..

దగ్గర రూట్లకు మాత్రమే నడుపుతున్న బస్సులు ఫ ఆదాయానికి భారీ గండి 

 తణుకు డిపోకు13 రోజుల్లో సుమారు రూ. కోటి నష్టం

తణుకు, మే 17 : కరోనా కర్ఫ్యూ ఎఫెక్ట్‌తో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి పడింది. సెకెండ్‌ వేవ్‌ ప్రారంభం అయ్యాక ప్రభుత్వం కర్ఫ్యూ విఽధించిన నేపథ్యంలో డిపో నుంచి ఉదయం వెళ్లిన బస్‌లు మళ్లీ 12 గంటలోపు డిపోకు చేరిపోవాలి. అధికారులు దగ్గరగా ఉన్న రూట్లకు మాత్రమే బస్‌లు నడుపుతున్నారు. దీనివల్ల తణుకు డిపో పరిధిలో టిక్కెట్ల ద్వారా రోజుకు లక్ష రూపాయలకు పైడి మాత్రమే వస్తున్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు రూ. 9 లక్షల వరకు ఆదాయం వచ్చేది. ఇప్పుడు లక్ష లోపు ఆదాయం వస్తుంది. కర్ఫ్యూ విఽధించిన 13 రోజుల్లో  సుమారుకోటి రూపాయలు  నష్టం వాటినల్లినట్టు అధికారులు చెబుతున్నారు. 93 సర్వీసులు తిరగాల్సి ఉండగా ప్రస్తుతం 20 సర్వీసులు తిరుగుతున్నాయి. జిల్లా పరిధిలోని గ్రామాలకు మాత్రమే సర్వీసులు పరిమితం అయ్యాయి. రాష్ట్ర పరిధిలో కాని, ఇతర రాష్ట్రాలకు కాని సర్వీసులు నడపడం లేదు. దీనివల్ల బాగా నష్టాలు వస్తున్నాయని, తిరిగే రూట్లలో కూడా బస్‌లు ఖాళీగా ఉంటున్నాయి. కరోనా భయం వల్ల బస్‌లు కాకుండా వ్యక్తిగత వాహనాలు ద్వారా తమ ప్రయాణాలు చేయడం అలవాటుగా మారిపోయిందని అధికారులు తెలుపుతున్నారు.

Updated Date - 2021-05-18T05:13:10+05:30 IST