విద్యుత్‌ కోతల్లేవు.. వదంతులు నమ్మవద్దు: ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ

ABN , First Publish Date - 2021-10-17T07:57:56+05:30 IST

ఇక ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ అమలులోకి వస్తుందని, విద్యుత్‌ కోతలు ఉండవని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ కె.సంతోషరావు స్పష్టం చేశారు.

విద్యుత్‌ కోతల్లేవు.. వదంతులు నమ్మవద్దు: ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ

రాజమహేంద్రవరం, అక్టోబరు 16(ఆంఽధ్రజ్యోతి): ఇక ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ అమలులోకి వస్తుందని, విద్యుత్‌ కోతలు ఉండవని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ కె.సంతోషరావు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు సరఫరా అందుబాటులోకి తేవడంవల్ల ఇక విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఉండదని ఆయన తెలిపారు. ఆక్వా ఫీల్డ్‌కు కూడా ఇక అవసరం మేరకు వాడుకోవచ్చన్నారు. ఇంతవరకూ ఆక్వాకు సాయంత్రం 6గంటలనుంచి 10గంటల వరకూ నిబంధనలు విధించారు. అనధికారికంగా గ్రామాల్లోను వి ద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక కోతలు ఉండవన్న సీఎండీ ప్రకటనతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్టు అయింది.




Updated Date - 2021-10-17T07:57:56+05:30 IST