Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యుదాఘాతంతో ఎలక్ర్టీషియన్‌ మృతి

పిడుగురాళ్ల, డిసెంబరు 3: విద్యుత్‌ మరమ్మత్తులు చేస్తూ ప్రమాదవశాత్తూ విద్యుత్‌షాక్‌కు గురై ఎలక్ట్రీషియన్‌ మృతిచెందాడు. బ్రాహ్మణపల్లి గ్రామంలో ఓ ఇంటికి విద్యుత్‌ వైర్లు బిగించేందుకు విద్యుత్‌ శాఖ వారిని పిలిపించారు. లైన్‌మేన్‌ తన వెంట షేక్‌ మహబూబ్‌ జానీబాషా(20) అనే వ్యక్తిని తీసుకువచ్చాడు. పనిచేస్తున్న సమయంలో బాషా విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు.  మృతుడి కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు బ్రాహ్మణపల్లి గ్రామ విద్యుత్‌ లైన్‌మెన్‌, అసిస్టెంట్‌ లైన్‌మెన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చరణ్‌ తెలిపారు. 

 

Advertisement
Advertisement