నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

ABN , First Publish Date - 2021-10-22T05:06:20+05:30 IST

విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఓ యువకుడు బలయ్యాడు. మండలంలోని కుంటకాడిపల్లి సమీపంలో ట్రా న్స్‌ఫార్మర్‌కు ఎర్త్‌ ఫీజు వేస్తుండగా ఓ యువకుడు గురువారం మృతి చెందాడు.

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
కొండయ్య మృతదేహం

విద్యుదాఘాతానికి యువకుడి మృతి.. ఫ్యూజు వేస్తుండగా ఘటన 

రాచర్ల, అక్టోబరు 21 : విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఓ యువకుడు బలయ్యాడు. మండలంలోని కుంటకాడిపల్లి సమీపంలో ట్రా న్స్‌ఫార్మర్‌కు ఎర్త్‌ ఫీజు వేస్తుండగా ఓ యువకుడు గురువారం మృతి చెందాడు. ఆ విద్యుత్‌ స్తంభం లైన్‌ గతంలో అనంపల్లె విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో ఉండేది. ఈ లైన్‌ను ఇటీవలకాలంలో యర్రబాలెం ఫీడర్‌లో కలిపారు. దీని పై విద్యుత్‌శాఖ అధికారులందరికీ పూర్తి సమాచారం లేదు. అలాగే పర్యవేక్షణ కూడా లేదు. ఈ నిర్లక్ష్యమే ఓ ప్రాణాన్ని పొట్టనపెట్టుకుంది. వివరాల్లోకెళ్తే... రాచర్ల గ్రామానికి చెందిన వెలగపాటి కొండయ్య చుట్టుపక్కల గ్రామాలలో చిన్నపాటి విద్యుత్‌ సమస్యలతోపాటు ప్రైవేటు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుంటకాడిపల్లె సమీపంలోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎర్త్‌ఎడ్జ్‌ఫ్యూజు తెగిపోయింది. దీనికి మరమ్మతులు చేసేందుకు లైన్‌మన్‌ రఫీ కొం డయ్యను పిలిపించాడు. వాస్తవంగా లైన్‌మన్‌ ఫ్యూజు వేయాల్సి ఉంది. అలాకాకుండా అతన్ని పిలిపించి అనంపల్లె సబ్‌స్టేషన్‌లో ఎల్‌సీ తీసుకున్నాడు. ఇటీవల చేసిన లైన్‌ మార్పుల ప్రకారం యర్రబాలెం సబ్‌స్టేషన్‌లో ఎల్‌సీ తీసుకోవాల్సి ఉండగా అక్కడ కాకుండా అనంపల్లెలో తీసుకున్నాడు. ఈ విషయం తెలియని కొండయ్య ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎర్త్‌ఎడ్జ్‌ ఫ్యూజు వేస్తుండగా విద్యుత్‌ తీగ మెడకు తగలడంతో షాక్‌ తగిలి కిందపడి చనిపోయా డు. కొండయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ త్యాగరాజు, వీఆర్వో నారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని, యర్రబాలెం సబ్‌స్టేషన్‌ పరిధిలో ఉండడంతో కంభం ఎస్‌ఐకి సమాచారం ఇచ్చినట్లు ఎస్‌ఐ త్యాగరాజు తెలిపారు. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ప్రజలు విమర్శిస్తున్నారు. 


మొగిలిచెర్లలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

మొగిలిచెర్ల(లింగసముద్రం), అక్టోబరు 21 : మండలంలోని మొగిలిచెర్ల గ్రామంలో ఇంటర్‌ విద్యార్థి వీరమాచినేని సాయిసంపత్‌కుమార్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాయి సంపత్‌కుమార్‌ నె ల్లూరులోని నారాయణ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వచ్చి బుధవారం కళాశాలకు వెళ్తానని తలిదండ్రులకు చెప్పాడు. గురువారం వెళ్లాలని తలిదండ్రు లు వెంకట్రావు, రవణమ్మలు చెప్పి డబ్బులు ఇచ్చారు. సంపత్‌ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన తల్లి రవణమ్మ వెంటనే లింగసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై రమేష్‌ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని కిందకు దించి కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.


బ్యాంక్‌ మేనేజర్‌ ఆత్మహత్యాయత్నం

ఒంగోలులోని ప్రైవేటు  ఆస్పత్రికి తరలింపు

వలేటివారిపాలెం, అక్టోబరు 21 : వలేటివారిపాలెం స్టేట్‌బ్యాంక్‌ మేనేజర్‌ కొండవీటి కిషోర్‌ గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన గదిలో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. బ్లేడ్‌తో గొంతు, చేతులు కోసుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సుదర్శన్‌యాదవ్‌ ఘటనా స్థలానికి వెళ్లి ఆయనను కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు, బ్యాంకు సిబ్బంది తెలిపిన కథనం ప్రకారం.. మేనేజర్‌ బుధవారం బ్యాం కుకు సెలవుపెట్టి సొంతూరైన ఒంగోలు వెళ్లారు. గురువారం ఎప్పటిలాగానే బ్యాంక్‌కు వచ్చారు. ఆ తర్వాత బ్యాంకుపైన రెండో అంతస్థులోని తన గదికి వెళ్లారు. ఎంతసేపటికి బయటకు రాలేదు. దీంతో మెసెంజర్లు సాయంత్రం 3 గంటల సమయంలో ఆయన గదిలోకి వెళ్లారు. రక్తగాయాలతో అపస్మారక స్థితిలో పడిఉన్నారు. మంచం, నేలమీద రక్తపు మరకలు, మంచం కింద బ్లేడు ఉన్నట్లు ఎస్సై సుదర్శన్‌యాదవ్‌ చెప్పారు. పోకూరు స్టేట్‌బ్యాంక్‌లో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తూ మూడు నెలల క్రితం వలేటివారిపాలెం స్టేట్‌బ్యాంక్‌ మేనేజరుగా విధుల్లో చేరారు. మేనేజర్‌ కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించి ఉంటాడని పలువురు పేర్కొన్నారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


వీఆర్‌ కోటలో వైసీపీలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ

వీఆర్‌ కోట(లింగసముద్రం)అక్టోబరు 21 : మండలంలోని వైసీపీకి చెం దిన ఇరువర్గాలకు చెందిన నేతలు పాత కక్షల నేపథ్యంలో ఘర్షణ పడ్డారు. దీంతో పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఎస్సై రమేష్‌ కథనం మేరకు... గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గ్రామంలో వైసీపీ చెందిన వంకాయలపాటి రవికుమార్‌ నడిచి వెళుతున్నాడు. అదే పార్టీలోని మరో వర్గానికి చెందిన పంగా చెన్నపనాయుడు దుర్భాషలాడా రు. ఎందుకు తిట్టావని చెన్నపనాయుడిని అడగ్గా, ఇరువురి మధ్య వాదన జరిగింది. చెన్నపనాయుడు ఆగ్రహంతో రాయితో రవికుమార్‌ను కొట్టడంతో కుడి కంటిపైన గాయమైంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలకు చెందిన వారు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో రవికుమార్‌ భార్యకు కూడా గాయాలయ్యా యి. అలాగే చెన్నపనాయుడును రవికుమార్‌ రాయితో కొట్టడంతో ఎడమ కంటిపైన, కుడిమోకాలుపైన గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు ఎస్సై రమేష్‌ కేసులు నమోదు చేసి, వారిని చికిత్స కోసం కందుకూరులోని ఏరియా వైధ్యశాలకు తరలించారు.

Updated Date - 2021-10-22T05:06:20+05:30 IST