భారతీయులపై చైనా హ్యాకర్ల సైబర్ దాడులు
ABN , First Publish Date - 2020-12-20T08:54:59+05:30 IST
పండుగల సమయంలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరిట భారీగా ఆఫర్లు పెడుతుంటాయి. అదే సమయంలో
న్యూఢిల్లీ, డిసెంబరు 19: పండుగల సమయంలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరిట భారీగా ఆఫర్లు పెడుతుంటాయి. అదే సమయంలో వాట్సా్‌పలలో ఒక సందేశం చక్కర్లు కొడుతుంటుంది. ‘బిగ్ బిలియన్ డేస్ స్పిన్ ద లక్కీ వీల్’ లేదా ‘స్పిన్ ద లక్కీ వీల్’ పేరుతో ఒక లింక్ వస్తుంది. అది క్లిక్ చేస్తే చక్రం తిరుగుతున్న పేజీ ఒకటి తెరుచుకుంటుంది. ఆ చక్రం ఒప్పో ఎఫ్ 17ప్రో వద్ద ఆగుతుంది. దీంతో.. ఆ ఫోన్ మీకు ఫ్రీగా పంపిస్తున్నాం అని అందులో ఒక సందేశం కనిపిస్తుంది. కానీ అది చైనా హ్యాకర్ల పని అని తేల్చి చెబుతోంది సైబర్ పీస్ అనే స్వచ్ఛంద సంస్థ. లక్షలాదిమంది భారతీయుల వివరాలే లక్ష్యంగా చైనాకు చెందిన హ్యాకర్లు ఈ కుంభకోణానికి తెర లేపారంటూ ఒక నివేదిక విడుదల చేసింది. ‘‘చైనాలోని గువాంగ్‌డాండ్, హెనన్ ప్రావిన్సుల నుంచి హ్యాకర్లు సైబర్ దాడులు కొనసాగించారు.
ఫాండ్ షావో కింగ్ అనే సంస్థ నుంచి ఈ హ్యాకింగ్ జరిగింది. అలీబాబా క్లౌడ్ కంప్యూటింగ్ వేదికపై తమ డొమైన్లను హ్యాకర్లు నమోదు చేసుకున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆఫర్లంటూ నకిలీ లింకుల్ని సృష్టించి హ్యాకర్లు నెటిజన్లను ఆకర్షించారు. ‘బిగ్ బిలియన్ డేస్ స్పిన్ ద లక్కీ వీల్’, ‘స్పిన్ ద లక్కీ వీల్’ వంటివన్నీ ఈ హ్యాకింగ్ కుంభకోణంలో భాగమే. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి’’ అని సైబర్‌పీస్ నివేదికలో పేర్కొంది.