సైఫోద్దీన్‌ జీవితం ఆదర్శప్రాయం

ABN , First Publish Date - 2021-01-16T05:13:49+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధులు, డాక్టర్‌ సైఫోద్దీన్‌ కిచ్లూ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని ముస్లిం పెద్దలు మౌలానా అత్తర్‌ఈరీ అన్నారు.

సైఫోద్దీన్‌ జీవితం ఆదర్శప్రాయం
సైఫోద్దీన్‌ కిచ్లూ జీవిత పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ముస్లిం పెద్దలు

సూర్యాపేట సిటీ, జనవరి 15: స్వాతంత్య్ర సమరయోధులు, డాక్టర్‌ సైఫోద్దీన్‌ కిచ్లూ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని ముస్లిం పెద్దలు మౌలానా  అత్తర్‌ఈరీ అన్నారు. సూర్యాపేట పట్టణంలో మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో సైఫోద్దీన్‌ కిచ్లూ 133వ జయంతిని శుక్రవారం నిర్వహించారు. అనంతరం సైపోద్ధిన్‌ కిచ్లూ జీవితంపై పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు హఫీజ్‌ కాలేజ్‌ అహ్మద్‌, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హసేన్‌, ఖలీల్‌, అహమ్మద్‌ మౌలానా, అమర్‌, అబీద్‌, ఖలీం, అబూబాకర్‌, సిద్దిక్‌, హఫీజ్‌, ముజాహిద్‌, గయాసోన్‌, జావెద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:13:49+05:30 IST