Advertisement
Advertisement
Abn logo
Advertisement

దార్శనికుడు అంబేద్కర్‌

కలెక్టర్‌ చక్రధర్‌బాబు

రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి


నెల్లూరు (వీఆర్సీ), డిసెంబరు 6 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రపంచానికే దార్శనికుడని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు కొనియాడారు. సోమవారం అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా నెల్లూరులోని వీఆర్సీ కూడలిలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రపంచంలోనే ఎవ్వరూ సాధించలేని డిగ్రీలు పొందిన మహా మేధావి అంబేద్కర్‌ అన్నారు. అసమానతలు లేని సమాజం కోసం పరితపించిన మహనీయుడని, నేటి యువత ఆయన ఆశయ సాధనకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీ రోజ్‌మాండ్‌, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చెన్నయ్య, ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌, బీసీ వెల్ఫేర్‌ అధికారి వెంకటయ్య, డీఈవో రమేష్‌,  హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఈ విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement