సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రైటర్ల దందా

ABN , First Publish Date - 2021-09-05T05:30:00+05:30 IST

మదనపల్లె సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో దళారీ వ్యవస్థ వేళ్లూనుకుపోయింది. దళారీ అవతారమెత్తిన కొందరు డాక్యుమెంట్‌ రైటర్లు సూత్రధారులు కాగా, అధికారులు, సిబ్బంది పాత్రదా రులుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి కార్యాలయానికి వచ్చిన క్రయ, విక్రయదారులు, రైతులు ఎవరినీ వీరు వదలడం లేదు.

సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రైటర్ల దందా
మదనపల్లె సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం

పైసలిస్తే ఏ పత్రమైనా సిద్ధం


రూ.వందల పనికి వేలల్లో వసూళ్లు


పెత్తనమంతా రైటర్ల సహాయకులదే!


మదనపల్లె, సెప్టెంబరు 5: మదనపల్లె సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో దళారీ వ్యవస్థ వేళ్లూనుకుపోయింది. దళారీ అవతారమెత్తిన కొందరు డాక్యుమెంట్‌ రైటర్లు సూత్రధారులు కాగా, అధికారులు, సిబ్బంది పాత్రదా రులుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి కార్యాలయానికి వచ్చిన క్రయ, విక్రయదారులు, రైతులు ఎవరినీ వీరు వదలడం లేదు. నిబంధనలతో సంబంధం లేకుండా పైసలిస్తే చాలు ఏపనైనా చేసిపెడతామనే ధీమాతో ముందుకెళ్తున్నారు. ఇక్కడి అధికారులు, సిబ్బందిని కాసులతో కొనేస్తున్నారు. రూ.వందల్లో పూర్తయ్యే పనికి వేలల్లో వసూలు చేస్తున్నారు. సాధారణ రిజిస్ర్టేషన్ల కంటే, నాలుగురాళ్లు ఎక్కువగా వచ్చే పనులపై శ్రద్ధ చూపుతున్నారు. ఈ క్రమంలో డీకేటీలు, అనధికార లేఅవుట్లు, నిషేధిత సర్వే నెంబ ర్లులోని వ్యవసాయ భూమి, ప్లాట్లను రిజిస్ర్టేష న్లు చేస్తున్నారు. ఇక్కడ కార్యాలయ పరిధిలో 20 మంది డాక్యుమెంటు రైటర్లు ఉంటే, అందులో సగం మంది దళారీలే. వీరే ఇక్కడి కార్యాలయంలో కీలకంగా మారారు. అధికారులతో ఏర్పరుచుకున్న ఒప్పందంతో ఎలాంటి డాక్యుమెంటునైనా రిజిస్ర్టేషన్‌ చేయిస్తున్నా రు. భూమి, ప్లాటు విస్తీర్ణాన్ని బట్టి రూ.50వేల నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఈ మొత్తంలో కార్యాలయంలో పాతిక శాతం ఇస్తున్నట్టు వినికిడి. అసైన్డ్‌, డీకేటీ, ప్రభుత్వ భూములు, అనధి కార లేవుట్లు, చివరకు కోర్టు కేసులున్నా రిజిస్ర్టేషన్లు చేసేస్తున్నారు. మొదట్లో పెండింగ్‌ నెంబర్‌ పెట్టడం, తర్వాత మరింత రేటు పెంచి రెగ్యులర్‌ నెంబర్‌ ఇస్తున్నారు. అలాగే రిజిస్ర్టేషన్లు కాని స్థలాలు, ప్లాట్ల కు సమీపంలోని మరో సర్వే నెంబర్‌తో రిజిస్ర్టేషన్‌ చేయడం, తర్వాత సరవణ పేరుతో అక్రమాన్ని సక్ర మం చేస్తున్నారు. ఇలా ఏడెనిమిది మంది రైటర్లు పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న ట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు రైటర్లు ముగ్గురు సహాయకులను నియమించుకుని అధికా రులు, సిబ్బందిని  బెదిరించడం, దౌర్జన్యాలకు పాల్ప డుతున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. కార్యాల యంలో సిబ్బంది కంటే వీరి పెత్తనమే అధికంగా ఉందంటే అతిశయోక్తికాదు. కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలంటే గ్రేడ్‌-1అధికారితోనే సాధ్యమనే వాదన వినిపిస్తోంది.  

సిబ్బంది లేమీ...  

జిల్లాలో తిరుపతి తర్వాత రోజువారీ వంద డాక్యుమెంట్ల రిజిస్ర్టేషన్లతో సర్కారుకు ఖజానాకు భారీ ఆదాయం తెచ్చే పెట్టే మదనపల్లె కేంద్రంపై అధికారుల పర్యవేక్షణ శూన్యమనే చెప్పాలి. గ్రేడ్‌-1 స్థాయి సబ్‌రిజిస్ర్టార్‌ను నియమించాలి. కానీ అరకొర సిబ్బందితోపాటు జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లతో ఏళ్ల కాలం వెళ్లదీస్తున్నారు. ప్రధానంగా ఇదే ఇక్కడ అవినీతి, అక్రమాలు పేరిగిపోవడానికి కారణమైంది. కార్యాలయం అంతా ఇద్దరిపైనే ఆధారపడి నడు స్తోంది. దీంతో రిజిస్ర్టేషన్లే కాదు..డాక్యుమెంట్లు స్కానింగ్‌ కూడా రెండువారాలు పడుతోంది. ఇక ఈసీలు, సీసీలు, మ్యానువల్‌ నకళ్లు కావాలంటే నెలలు పడుతోంది. దీంతో ఉదయం 6నుంచి రాత్రి 10గంటల వరకు కూడా దళారులు, రైటర్ల సహాయ కులు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది  కార్యాలయంలోనే ఉంటున్నారు.

Updated Date - 2021-09-05T05:30:00+05:30 IST