Advertisement
Advertisement
Abn logo
Advertisement

అత్తా.. నీ కొడుకును చంపా.. పెళ్లయిన 6 నెలలకే ఇంటికొచ్చి అత్తకు చెప్పిన కోడలు.. ఆ తల్లి నమ్మలేదు కానీ..

ఇంటర్నెట్ డెస్క్: కొడుక్కి ఆరు నెలల క్రితమే పెళ్లి చేసిందా తల్లి. భార్యాభర్తలిద్దరూ వేరు కాపురం పెడతామంటే సరేనంది. ఇద్దరూ కలిసి తనకు దూరంగా ఉంటున్నా ఊరుకుంది. అయితే ఒక రోజు సడెన్‌గా రాత్రిపూట కోడలు వచ్చి ఇంటి తలుపు తట్టింది. ఏం జరిగిందా? అని ఆశ్చర్యంగా తలుపు తీస్తే.. కోడలి దగ్గర నుంచి మద్యం మత్తు ఘాటుగా వస్తోంది. ఏంటిది? అని ప్రశ్నించగా ఆమె నవ్వుతూ.. ‘‘అత్తా నీ కొడుకును చంపేశా. అతని శవం ఇంట్లో ఉంది’’ అని చెప్పింది. మద్యం మత్తులో కోడలు ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతోందనుకుందా అత్త. కానీ ఆమె నిజంగానే తన కుమారుడిని చంపేసిందని అస్సలు ఊహించలేదు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన రాజస్థాన్‌లోని డుంగాపూర్‌లో జరిగింది.


ఇక్కడ స్థానికంగా నివసించే గలాబ్ యాదవ్ (64) అనే మహిళ.. పోలీసులకు తన కోడలిపై ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గలాబ్ యాదవ్ కుమారుడు నాథూ యాదవ్‌కు ఆరు నెలల క్రితమే పెళ్లయింది. భార్య కాంతాతో కలిసి ముంగేడ్ గ్రామంలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఆగస్టు 23న గలాబ్ యాదవ్ ఇంటికి రాత్రిపూట వచ్చిన కాంత.. తాను ఇక ఇంటికెళ్లనని, అత్తతోపాటే ఉంటానని అన్నది. అయితే దీనికి ఆ అత్త ఒప్పుకోలేదు. కుమారుడి గురించి అడగ్గా.. భర్తను తాను చంపేశానని చెప్పింది. అయితే మద్యం మత్తులో పిచ్చివాగుడు అనుకొని కోడలి మాటలను ఆమె పట్టించుకోలేదు.


అయితే నాథూ వాళ్ల ఇంటి చుట్టుపక్కల వాళ్లు అతని ఇంటి నుంచి దుర్గంధం వస్తుండటంతో.. కిటికీల్లోంచి ఇంట్లోకి తొంగి చూశారు. వారికి చలనం లేకుండా పడి ఉన్న నాథూ యాదవ్ కనిపించాడు. దీంతో అప్రమత్తమైన వాళ్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తలుపలు బద్దలుకొట్టి చూడగా నాథూ యాదవ్ మృతదేహం కనిపించింది. మరణించి నాలుగు రోజులు కావడంతో శవం నుంచి దుర్గంధం వస్తోంది. పురుగులు కూడా పట్టేశాయి. ఈ సమాచారం అందుకున్న గలాబ్ యాదవ్.. కుమారుడి ఇంటికొచ్చి నిర్ఘాంతపోయింది. కోడలు చెప్పిన మాటలు పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేసింది. కాంత కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ ఇంటి దగ్గర్లో ఉన్న సీసీ కెమెరాలో ఆమె ఇంటికి తాళం వేసి వెళ్లడం స్పష్టంగా కనిపిస్తోందని పోలీసులు తెలిపారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement