ఎకరం మిర్చిసాగుకు రూ.99 వేల రుణం

ABN , First Publish Date - 2021-01-19T05:30:00+05:30 IST

ఎకరం మిర్చి సాగుకు బ్యాంకులు రూ.99 వేలు రుణంగా ఇస్తాయని డీసీసీబీ చైర్మన్‌ లాలుపురం రాము తెలిపారు.

ఎకరం మిర్చిసాగుకు రూ.99 వేల రుణం
సమావేశంలో ప్రసంగిస్తున్న చైర్మన్‌ రాము

గుంటూరు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ఎకరం మిర్చి సాగుకు బ్యాంకులు రూ.99 వేలు రుణంగా ఇస్తాయని డీసీసీబీ చైర్మన్‌ లాలుపురం రాము తెలిపారు. గుంటూరులోని బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్‌ సహకార భవన్‌లో మంగళవారం 2021-22 పంట రుణాల పరిమితిని ఖరారు చేసే సాంకేతిక కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు.   ప్రతి ఏటా వ్వవసాయ ఖర్చులు పెరుగుతున్నాయని, దానికి అనుగుణంగా బ్యాంకులు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను పెంచాల న్నారు. బ్యాంకులు పంటలకు పూర్తి స్థాయిలో రుణాలు ఇవ్వకపోవటం వల్ల రైతన్నలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. ఎల్‌డీఎం ఈదర రాంబాబు మాట్లాడుతూ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ జిల్లాలో ఎక్కువగా వుందన్నారు. సమావేశంలో నాబార్డు ఏజీఎం కార్తీక్‌, బ్యాంకు సీఈవో కృష్ణవేణి తదితరులు ప్రసంగించారు.


Updated Date - 2021-01-19T05:30:00+05:30 IST