ప్రమాదవశాత్తు చెరువులో మునిగిన డీసీఎం

ABN , First Publish Date - 2021-01-18T05:26:42+05:30 IST

వాహనాన్ని శుభ్రం చేసేందుకు చెరువు వద్దకు డీసీఎంను తీసుకెళ్లగా ప్రమాదవశాత్తు నీట మునిగిన ఘటన వావిలాల పీర్షా చెరువు వద్ద జరిగింది.

ప్రమాదవశాత్తు చెరువులో మునిగిన డీసీఎం
చెరువులో మునిగిన డీసీఎం

జిన్నారం, జనవరి 17: వాహనాన్ని శుభ్రం చేసేందుకు చెరువు వద్దకు డీసీఎంను తీసుకెళ్లగా ప్రమాదవశాత్తు నీట మునిగిన ఘటన వావిలాల పీర్షా చెరువు వద్ద జరిగింది. ఆదివారం వావిలాల పీర్షా చెరువు శివారులో ఓ డీసీఎం  డ్రైవర్‌ వాహనాన్ని శుభ్రం చేసేందుకు తీసుకెళ్లాడు. నీటితో వాహనాన్ని కడిగే క్రమంలో బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ఒక్కసారిగా నీటిలోకి వెళ్లి పూర్త్తిగా మునిగింది. డ్రైవర్‌ సురక్షితంగా బయట పడ్డాడు. 


Updated Date - 2021-01-18T05:26:42+05:30 IST