Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం

 బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు 

నల్లగొండ క్రైం, డిసెంబరు 2 : నల్లగొండ పట్టణ పరిధిలోని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి సమయంలో ఆర్టీసీ బస్సును డీసీఎం ఢీకొట్టింది. డీసీఎం డ్రైవర్‌ అజాగ్రత్తతో ఆర్టీసీ బస్సును వెనకాల నుంచి ఢీకొట్టిన తర్వాత డీసీఎం బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులకు, డీసీఎం డ్రైవర్‌, క్లీనర్‌కు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమచారం మేరకు మిర్యాలగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును చర్లపల్లి సమీపంలోని మర్రిగూడ బైపాస్‌ అంబేడ్కర్‌-జగ్జీవన్‌ రామ్‌ విగ్రహాల వద్ద బస్సు వెనకాల వస్తున్న డీసీఎం ఢీకొంది. అనంతరం డీసీఎం బోల్తా పడింది. ఈ సమయంలో బస్సులో కొద్ది మంది ప్రయాణికులు మాత్రమే ఉండడంతో స్వల్ప గాయాలు కాగా పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సును డీసీఎం వెనకాల నుంచి ఢీకొట్టడంతో  బస్సు వెనుకభాగం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.


Advertisement
Advertisement