వ్యాక్సిన్ తీసుకోనివారిపై డెల్టా వేరియంట్ తీవ్ర ప్రభావం!

ABN , First Publish Date - 2021-08-28T13:45:04+05:30 IST

కరోనా టీకా ఒక్క డోసు కూడా వేసుకోని వారిపై డెల్టా వేరియంట్ ప్రభావం...

వ్యాక్సిన్ తీసుకోనివారిపై డెల్టా వేరియంట్ తీవ్ర ప్రభావం!

న్యూఢిల్లీ: కరోనా టీకా ఒక్క డోసు కూడా వేసుకోని వారిపై డెల్టా వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఒక్క డోసు టీకా తీసుకుని డెల్టా వేరియంట్ బారినపడితే వారిలో డెత్ రేటు 1.34 శాతంగా ఉంటుందని, అదే రెండు డోసులు తీసుకున్నవారికి డెల్టా వేరియంట్ సోకితే డెత్ రేటు ‘జీరో’ అని శాస్త్రవేత్తలు తెలిపారు. 


దీని ప్రకారం రెండు డోసుల టీకా తీసుకున్న వారికి డెల్టా వేరియంట్ సోకినా వారెవరూ మృత్యువాత పడలేదని తేలింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూణెకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)కి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ప్రజ్ఞా యాదవ్ మాట్లాడుతూ టీకా తీసుకున్నవారిలో కరోనా డెల్టా వేరియంట్ ప్రభావం కొంత పరిధి వరకే ఉన్నదని, బాధితులు ఆసుపత్రిలో చేరడం, ప్రాణహాని ఏర్పడటం వంటివి తలెత్తడం లేదన్నారు.

Updated Date - 2021-08-28T13:45:04+05:30 IST