అప్పులబాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-17T05:56:55+05:30 IST

మండలంలోని గుద్దెళ్ల గ్రామ రైతు హనుమన్న (45) అప్పులబాధ తాళలేక ఉరేసుకొని శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పులబాధతో రైతు ఆత్మహత్య


కంబదూరు, అక్టోబరు16: మండలంలోని గుద్దెళ్ల గ్రామ రైతు హనుమన్న (45) అప్పులబాధ తాళలేక ఉరేసుకొని శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమన్న తనకున్న ఐదెకరాల పొలంలో పంటసాగుకు సుమారు రూ.10 లక్షలు అప్పులు చేశాడు. పంటచేతికి రాకపోవడంతో అప్పులు తీర్చలేక.. తీవ్ర మనస్తాపం చెందాడు. గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రి తరలించామనీ, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు. హనుమన్నకు భార్య లలితమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.


ఉద్యోగి కూడా..

అనంతపురం క్రైం, అక్టోబరు 16: స్థానిక సర్వజనాస్పత్రిలో రికార్డు అసిస్టెంట్‌ మురళీధర్‌ (45) అప్పుల బాధ భరించలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానిక కోవ్వూర్‌నగర్‌కు చెందిన మురళీధర్‌, జ్యోతి దంపతులకు ఒక కుమారుడు. కొన్నేళ్లుగా ఇంట్లో తెలియకుండా మురళీధర్‌ అప్పులు చేశాడు. ఇటీవల ఈ విషయం తెలియడంతో దంపతుల మధ్య విభేదాలొచ్చాయి. గత నెల 20న ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మురళీధర్‌ తిరిగి రాకపోవడంతో జ్యోతి.. తన భర్త కనిపించడంలేదని గతనెల 28న నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం ఉరవకొండ పరిధిలోని పెన్నోబిళం నరసింహస్వామి దేవాలయ సమీపంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించిన భక్తులు.. ఉరవకొండ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృ తుడి ఫొటోలు, ఆనవాలు పోలీసు గ్రూపులో పెట్టుడంతో నాలుగో పట్టణ పోలీసులు మృతుడిని మురళీధర్‌గా గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహన్ని ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అదృశ్యం.. ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు. మురళీధర్‌ ఆత్మహత్యకు పాల్పడి చాలా రోజులైనట్లు గుర్తించారు.


Updated Date - 2021-10-17T05:56:55+05:30 IST