తగ్గుతున్న ఉపాధి!

ABN , First Publish Date - 2022-09-20T05:55:47+05:30 IST

గతంలో కారుచీకట్లో కాంతి పుంజలా వేలాదిమందికి పనులు కల్పించిన ఉపాధి హామీ పథకం ఇప్పుడు ఊసురుమనిపిస్తోంది. గ్రామీణ వ్యవసాయ కూలీలకు ఆసరాగా ఉన్న ఈ పథకం లక్ష్యం సన్నగిల్లుతోంది.

తగ్గుతున్న ఉపాధి!

కొన్నేళ్లుగా పనిదినాలు తగ్గిస్తున్న కేంద్రం

గతేడాది 63 లక్షల పనిదినాలు.. ప్రస్తుతం 43 లక్షలకే పరిమితం

తగ్గుతున్న పనులతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీల ఇక్కట్లు

గతంలో కూలీలకు కల్పతరువులా ఉపాధి హమీ పథకం

కామారెడ్డి, సెప్టెంబరు 19: గతంలో కారుచీకట్లో కాంతి పుంజలా వేలాదిమందికి పనులు కల్పించిన ఉపాధి హామీ పథకం ఇప్పుడు ఊసురుమనిపిస్తోంది. గ్రామీణ వ్యవసాయ కూలీలకు ఆసరాగా ఉన్న ఈ పథకం లక్ష్యం సన్నగిల్లుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏటా పనిదినాలను తగ్గిస్తుండడమే ఇందుకు కారణం. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనులు తగ్గిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ పథకం నిర్వహణ సాగుతోంది. అయితే కేంద్రం నిధులు, పనిదినాల సంఖ్య తగ్గించడంతో కూలీలకు ఉపాధి కల్పించలేని పరిస్థితి వస్తోంది. మరోవైపు వేతనాలు పెరుగుతున్నా.. క్షేత్రస్థాయిలో కూలీలకు చేతికి అందే వేతనాలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో కూలీలు కూడా ఈ పనులపై అంతగా ఆసక్తిచూపడం లేదు.

కూలీలకు చేయూత..

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి పనికల్పించాలనే లక్ష్యంతో 2005లో కేంద్ర ప్రభు త్వం మహాత్మాగాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌)ను ప్రవేశపెట్టింది. ఇక సుమారు మూడోవంతు పనులను మహిళలకు ప్రత్యేకంగా కే టాయించడంతో గ్రామీణప్రాంతాల్లో ఈ పథ కం వ్యవసాయ పనులులేని సమయంలో కల్పతరువులా ఉండేది. ఏటా జిల్లాలో వ్యవసాయపనులు ముగిశాక ఎక్కువగా ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం, నర్సరీలు, మొక్కలు నాటడం వంటి పనులను ఉపాధికూలీల ద్వారా చేయిస్తుండడంతో ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారు. భూమిలేని వరి కి ఉపాధి హామీ పథ కం గ్రామీణ ప్రాంతా ల్లో ఓ వరంలా మారగా.. కరోనా పరిస్థితుల్లో పట్టణాల్లో ఉపాధి కోల్పోయిన వేలాది మందికి ఈ పథకాన్ని వినియోగించుకొని ఆర్థికంగా లబ్ధి పొందారు. 

తగ్గుతున్న పని దినాలు..

జిల్లాలో గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పనిదినాల సంఖ్యను పరిశీలిస్తే గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన పనిదినాల లక్ష్యాన్ని పూ ర్తిచేసి అదనంగా పనిదినాలు చేసినప్పుడే కేం ద్ర ప్రభుత్వం అదనపు బడ్జెట్‌ కేటాయిస్తోంది. అయితే 2020-21 ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం కోటీ పది లక్షల పనిదినాలను కల్పించగా, 2021-22లో 35.87 లక్షల పనిదినాలు మాత్రమే కల్పించింది. ఈలెక్కన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పనిదినాల తగ్గుదలతో ప్రజలు ఉపాధి హామీ పనులు చేయడానికి అంతంతమాత్రంగానే స్పందిస్తు వస్తున్నారు.

అంతంత మాత్రంగానే వేతనాలు..

రెండు, మూడేళ్లకోసారి ఉపాధి హామీ కూలీల కనీస వేతనాన్ని ప్రభుత్వాలు పెంచుతూ వస్తున్నా కూలీరేట్లను పరిశీలిస్తే 2020- 21లో కనీస వేతనం రూ.237 ఉండగా కూలీలకు సరాసరా రూ.166 మాత్రమే అందింది. 2021-22లో రూ.161 మాత్రమే అందింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వేతనాన్ని రూ.257కు పెంచగా కూలీలకు మాత్రం రూ.132 మాత్ర మే అందుతోంది. దీంతో మండుటెండల్లో ప నిచేసినా కనీస వేతనం రావడం లేదని కొం దరు కూలీలు కూడా ఇతర పనుల కోసం ప ట్టణాలకు వలస వెళ్తున్నారు. కూలీలు చేసిన పనులను సిబ్బంది లెక్కించడంలో ఆలస్యం జరుగుతుండడం, కొలతల్లో తేడాల కారణం తో కూడా ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోం ది. అలాగే గతంలో వేసవిలో పనిచేస్తే అదనంఆ ఇచ్చే భత్యాన్ని సైతం కేంద్రం తొలగించడంతో కూలీలకు అంతంతమాత్రంగానే వేతనం అందుతోంది.

Updated Date - 2022-09-20T05:55:47+05:30 IST