వారంలో రెండు రోజులు షట్‌డౌన్

ABN , First Publish Date - 2020-06-06T22:58:56+05:30 IST

కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. వారంలో రెండు రోజుల పాటు..

వారంలో రెండు రోజులు షట్‌డౌన్

డెహ్రాడూన్: కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. వారంలో రెండు రోజుల పాటు శని, ఆదివారాల్లో డెహ్రాడూన్‌లో పూర్తి షట్‌డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నిత్యావసరాలకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది.


దీనిపై డెహ్రాడూన్ జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ ఆశిష్ కుమార్ శ్రీవాత్సవ్ శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు 48 గంటల పాటు డెహ్రాడూన్‌ను మూసేస్తున్నట్టు చెప్పారు. ఈ సమయంలో సిటీలోని వంద వార్డుల్లోనూ  ముమ్మరంగా శానిటేషన్ చేపడతామని తెలిపారు. అత్యవసర సర్వీసుల్లో ఉండి, ఎమర్జెన్సీ పాసులు ఉన్న వారు మినహా తక్కిన వారంతా ఇళ్లలోనే ఉండాలని, తద్వారా వైరస్ వ్యాప్తిని బ్రేక్ చేసేందుకు వీలుంటుందని చెప్పారు. హెల్త్ ప్రోటోకాల్ ప్రకారం కంటైన్మెంట్ జోన్లలో శానిటైజేషన్‌కు సమర్ధవంతమైన చర్యలు చేపట్టినందున, సోమవారం నుంచి మార్కెట్లు తిరిగి తెరుచుకుంటాయని తెలిపారు. కాగా, ఉత్తరాఖండ్‌లో ఇంతవరకూ 1,215 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యం మంత్రిత్వ శాఖ తెలిపింది.

Updated Date - 2020-06-06T22:58:56+05:30 IST