ప్రియాంక భర్త రాబర్ట్ వాహనానికి ఢిల్లీ పోలీసుల చలాన్
ABN , First Publish Date - 2021-06-25T11:48:59+05:30 IST
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా వాహనానికి ఢిల్లీ పోలీసుల చలాన్ విధించారు....
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా వాహనానికి ఢిల్లీ పోలీసుల చలాన్ విధించారు.ఆగ్నేయ ఢిల్లీలోని బారావుల్లా ఫ్లైఓవర్ వెనుక నుంచి వేగంగా, ప్రమాదకరంగా, నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు రాబర్ట్ వాద్రా వాహనానికి చలాన్ విధించామని పోలీసులు చెప్పారు. బుధవారం రాబర్ట్ వాద్రా తన కార్యాలయానికి కారులో వెళుతుండగా అతని భద్రతా సిబ్బంది మరో వాహనంలో అనుసరించారు.ఆకస్మాత్తుగా రాబర్ట్ వాద్రా నడుపుతున్న కారుకు బ్రేక్ వేయడంతో అతని భద్రతా బృందం కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన తర్వాత రాబర్ట్ వాద్రా కారుకు చలాన్ జారీ చేశామని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.