Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 14 2021 @ 19:23PM

భారత్‌లో పేలుళ్లకు కుట్ర.. ఆరుగురు ఉగ్రవాదులు అరెస్ట్

న్యూఢిల్లీ: పండుగల వేళ భారత్‌లో పేలుళ్లకు కుట్రపన్నిన ఆరుగురు ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లోని రద్దీ ప్రదేశాల్లో పేలుళ్లకు వీరు కుట్రపన్నారని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీస్ కమిషనర్ నీరజ్ ఠాకూర్ తెలిపారు. నవరాత్రుల సమయంలో రామ్‌లీలా మైదానంతో పాటు దుర్గా పూజా మండపాల వద్ద పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని చెప్పారు. ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోని ఫామ్‌హౌస్‌లో శిక్షణ పొందారని, ఆర్డీఎక్స్ బాంబును అండర్‌‌వరల్డ్ సాయంతో ఢిల్లీకి తీసుకువచ్చారని ఠాకూర్ తెలిపారు. 1993 తర్వాత ఆర్డీఎక్స్‌ బాంబును రాజధానికి తరలించడం ఇదే ప్రథమం. 

దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీం ఆర్డీఎక్స్‌ బాంబును భారత్‌కు తరలించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆరుగురు ఉగ్రవాదుల్లో ఒసామా, జీషాన్‌కు 15 రోజుల శిక్షణ కూడా అనీస్ ఇబ్రహీం ఇప్పించాడని ఠాకూర్ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. 

Advertisement
Advertisement