ఢిల్లీలో భారీ ఉష్ణోగ్రతలు.. వందేళ్లనాటికంటే..

ABN , First Publish Date - 2021-03-02T22:49:24+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మొన్నటివరకు చలితో చంపేసిన వాతావరణం ఇప్పుడు వెచ్చబడుతూ ఇబ్బందులకు గురిచేస్తోంది. ఫిబ్రవరిలో లెక్కల ప్రకారం..

ఢిల్లీలో భారీ ఉష్ణోగ్రతలు.. వందేళ్లనాటికంటే..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మొన్నటివరకు చలితో చంపేసిన వాతావరణం ఇప్పుడు వెచ్చబడుతూ ఇబ్బందులకు గురిచేస్తోంది. ఫిబ్రవరిలో లెక్కల ప్రకారం ఢిల్లీలో సగటున 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎప్పుడే 120 ఏళ్ల క్రితం ఫిబ్రవరిలో నమోదైన ఉష్ణోగ్రతల స్థాయిలో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఉన్నాయని చెబుతున్నారు. ‘ఎప్పుడో 1901 ఫ్రిబ్రవరిలో సగటున 29.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.


ఆ తరువాత ఈ శతాబ్ద కాలంలో ఆ స్థాయిలో ఎప్పుడూ నమోదు కాలేదు. కానీ ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు 27.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంద’ని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉంటే గత 15 ఏళ్లుగా ఫిబ్రవరి నెలలో అత్యంత ఉష్ణోగ్రత కలిగిన రోజుగా బుధవారం ఉంటోంది. ఆ రోజు ఏకంగా 32 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదవుతుందని అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2021-03-02T22:49:24+05:30 IST