ఏపీ మందుకి భలే డిమాండబ్బా!

ABN , First Publish Date - 2021-05-16T05:01:46+05:30 IST

తమిళనాడులో లాక్‌డౌన్‌ అంటే మన మాదిరిగా కాదు. అన్నీ బంద్‌. దీంతో తమిళ మందుబాబులు తెల్లారకముందే సరిహద్దుల్లోని ఆంధ్ర మద్యం దుకాణాల ముందు బారులు తీరుతున్నారు.

ఏపీ మందుకి భలే డిమాండబ్బా!

పాలసముద్రం: తమిళనాడులో లాక్‌డౌన్‌ అంటే మన మాదిరిగా కాదు. అన్నీ బంద్‌. దీంతో తమిళ మందుబాబులు తెల్లారకముందే సరిహద్దుల్లోని ఆంధ్ర మద్యం దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. పాలసముద్రం మండలం బలిజకండ్రిగలోని మద్యం షాపు ఇది. రెండొందల మీటర్ల దూరంలో తమిళనాడు పల్లెలు ఉంటాయి. ఏపీ ప్రభుత్వమే స్వయంగా నిర్వహిస్తున్న ఈ మద్యం షాపులో గతంలో రోజుకు 10 వేల వ్యాపారం జరిగితే ఎక్కువ ఇప్పుడు మూడు నుంచి నాలుగు లక్షల మద్యం మధ్యాహ్నం 12 లోగా అమ్ముడైపోతోంది. నిజానికి తమిళనాడు కన్నా ఆంధ్రలో మద్యం ధరలు 30 శాతం ఎక్కువ. అయినా హాయిగా దొరుకుతుండడంతో ఏపీ ప్రభుత్వానికి జేజేలు పలుకుతూ మందుబాబులు ఎగబడుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టే ఇక్కడ మద్యం దుకాణం కూడా గంట ఎక్కువైనా తెరిచి సేవలందించడం విశేషం.

Updated Date - 2021-05-16T05:01:46+05:30 IST