Abn logo
Jul 29 2021 @ 01:29AM

ఔట్‌ సోర్సింగ్‌, ఎన్‌ఎంఆర్‌ సిబ్బందికి వేతనాలు పెంచాలి

జోనల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్‌, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది

ఎల్‌బీనగర్‌, జూలై 28 (ఆంధ్రజ్యో తి): జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌, ఎన్‌ఎంఆర్‌ తదితర సిబ్బందికి వెంటనే వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఎల్‌బీనగర్‌ జోనల్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నంబర్‌ 60 సవరించి, విభాగాల వారీగా రూ.19,000, 22,900, 31,040  కనీస వేతనంగా ఇవ్వాలన్నారు. అనంతరం డిమాడ్లంతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయంలో అందజేశా రు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కీసరి నర్సిరెడ్డి, ఎల్‌బీనగర్‌ సర్కిల్‌ కన్వీనర్‌ ఆలేటి ఎల్లయ్య, మున్ని, అలివేలు, విమల, శ్యామల, స్వరూప, యాదమ్మ, వనజ, భాగ్యమ్మ పాల్గొన్నారు.

జీవో 60ను మున్సిపాలిటీల్లోనే అమలు చేయాలి

అబ్దుల్లాపూర్‌మెట్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): జీవో నంబర్‌ 60 ప్రకారం మున్సిపాలిటీలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న కార్మికులకు వేతనాలను అమలు చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా నాయకుడు ఏర్పుల నర్సింహా డిమాండ్‌ చేశారు. బుధవారం కార్మికులతో కలిసి ఆయన పెద్దఅంబర్‌పేట్‌ కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోను జీహెచ్‌ఎంసీలో అమలు చేస్తుండగా, మున్సిపాలిటీల్లో అమలు చేయడం లేదన్నారు. మున్సిపాలిటీ కార్మికులకూ కూడా వర్తింపజేయాలని కోరారు. కార్యక్రమంలో శివ, మైసయ్య, లింగయ్య, మహేష్‌, రవి, హంసమ్మ, పద్మ, అలివేలు పాల్గొన్నారు. 

నిరుద్యోగ భృతి చెల్లించాలని కాంగ్రెస్‌..

వనస్థలిపురం, జూలై 28 (ఆంధ్రజ్యోతి): విజయవాడ జాతీయ రహదారి, వనస్థలిపురం పనామా చౌరస్తాలో ఎల్‌బీనగర్‌ యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఎన్‌రెడ్డి డివిజన్‌ అధ్యక్షుడు ఎం.సదాశివుడు, ఎల్‌బీనగర్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జి. శ్యామ్‌ చరణ్‌రెడ్డి,  నర్సింహాయాదవ్‌, కృష్ణానాయక్‌, వినయ్‌, మక్సూద్‌  పాల్గొన్నారు.