నిర్ణీత సమయంలో వివరాలు అందించాలి

ABN , First Publish Date - 2021-02-24T05:43:40+05:30 IST

గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నిక ఖర్చుల వివరాలను నిర్ణీత సమయంలో అందించాలని సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకుడు సీహెచ్‌ వెంకట సతీష్‌ సూచించారు.

నిర్ణీత సమయంలో వివరాలు అందించాలి

గరుగుబిల్లి: గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నిక ఖర్చుల వివరాలను నిర్ణీత సమయంలో అందించాలని సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకుడు సీహెచ్‌ వెంకట సతీష్‌ సూచించారు. మంగళవారం మండల అభివృద్ధి కార్యాలయంలో పంచాయతీలకు సంబంధించిన వివరాలను పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గరుగుబిల్లిలో 25 పంచాయతీలు, జియ్యమ్మవలసలో 31 పంచాయతీల్లో ఎన్నికల ఖర్చుల వివరాలను పరిశీలిస్తు న్నామన్నారు. ఖర్చుల వివరాలను ఈ నెలాఖరులోగా అందించాలన్నారు.


Updated Date - 2021-02-24T05:43:40+05:30 IST