Advertisement
Advertisement
Abn logo
Advertisement

శాంతి భద్రతల పరిరక్షణకే నిర్బంధ తనిఖీలు

 కోటపల్లి, డిసెంబరు 3: శాంతిభద్రతల పరిరక్ష ణకే నిర్బంధ తనిఖీలు చేపడుతున్నట్లు రామగుం డం ఓఎస్‌డీ శరత్‌చంద్రపవార్‌ అన్నారు. మావో యిస్టు పీఎల్‌జీఏ వారోత్సవాల సందర్భంగా శుక్ర వారం లింగన్నపేటలో ఏసీపీ నరేందర్‌, సీఐ నాగ రాజు ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు.  21 ద్విచక్రవాహనాలు, ఆటో,  ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓఎస్‌డీ మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దన్నారు. గ్రామాల్లో స్వీయరక్షణ కోసం సీసీ కెమెరాలను అమర్చుకోవాలన్నారు. గ్రామాల్లో ఎవరైనా కొత్త వారు కనిపిస్తే డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమా చారం అందించాలన్నారు. నిషేధిత గుట్కా, గుడుంబా, బెల్టుషాపుల నిర్వహణ, ఇసుక, కలప అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యకలా పాలు చేపడితే చర్యలు తీసుకుంటామన్నారు. యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు.  మహిళలు, యువతులు, చిన్నపిల్లలతో మర్యాదగా ప్రవర్తిం చాలన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలం దరు స్వీయరక్షణ పాటించాలని, మాస్కులను ధరించాలని సూచించారు. గ్రామంలోని వృద్ధులకు దుప్పట్లు, యువకులకు వాలీబాల్‌ కిట్‌లు అందిం చారు. చెన్నూరు రూరల్‌, టౌన్‌ సీఐలు నాగరాజు, ప్రవీణ్‌కుమార్‌, కోటపల్లి, నీల్వాయి ఎస్‌ఐలు రవి కుమార్‌, రహీంపాషా, సీఆర్‌ఫీఎఫ్‌, ప్రొబేషనరీ ఎస్‌ఐలు, ఎఎస్‌ఐలు,, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. 

నెన్నెల: నేరాలను అదుపు చేసేందుకు  కార్డన్‌సెర్చ్‌ నిర్వహిస్తున్నామని ఏసీపీ ఎడ్ల మహే ష్‌ అన్నారు. కొత్తూర్‌లో  తనిఖీలు చేపట్టారు. ధ్రువపత్రాలు లేని 28 బైక్‌లు, 3 ఆటోలు స్వాధీ నం చేసుకున్నారు. అనంతరం గ్రామస్థులతో ఏర్పా టు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు అనుమానస్పదంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వృద్ధులకు బ్లాంకెట్లు అందజేశారు. సీఐలు జగదీష్‌, రాజు, బాబారావు, ప్రమోద్‌రావు, నెన్నెల ఎస్సై రమాకాంత్‌, సబ్‌డివిజన్‌ ఎస్సైలు సమ్మయ్య, ప్రశాంత్‌రెడ్డి, నరేష్‌, కొమురయ్య, పీఎస్సైలు రవికుమార్‌, మహేష్‌ పాల్గొన్నారు. 

 

Advertisement
Advertisement