Abn logo
Nov 27 2020 @ 23:55PM

చలి గాలులకు 465 గొర్రెలు మృతి

రూ.26 లక్షలకు పైగా ఆస్తి నష్టం

ముప్పాళ్ళ, నవంబరు 27: మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి, చలి గాలులకు శుక్రవారం 465 గొర్రెలు మృతి చెందాయి. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలానికి చెందిన గొర్రెల పెంపకందారులతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేటకు చెందినవారు రుద్రవరం, బొల్లవరం, దమ్మాలపాడు గ్రామాల్లో తమ గొర్రెలతో ఉంటున్నారు. వర్షాలకు, చలి గాలులకు రుద్రవరంలో

47, బొల్లవరంలో 


70, దమ్మాలపాడులో 348 గొర్రెలు మృతి చెందాయి. మృతి చెందిన గొర్రెలను తహసీల్దార్‌ ఆర్‌.యశోద,  డాక్టర్‌ పుల్లారెడ్డి, డాక్టర్‌ వి.గోపాల్‌ నాయక్‌ పరిశీలించారు. 


Advertisement
Advertisement
Advertisement