టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

ABN , First Publish Date - 2022-08-02T08:46:45+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం
అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 

నిర్మల్‌ చైన్‌గేట్‌, ఆగస్టు 1 : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఈద్గాం, సిద్దాపూర్‌, ఆదర్శనగర్‌, రాంనగర్‌ ప్రాంతాల్లో వైకుంఠధామాల వద్ద దుకాణ సముదాయాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేంధర్‌, పట్టణాధ్యక్షులు మారుగొండరాము, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేంధర్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు పాకాల రాంచందర్‌, కౌన్సిలర్‌లు నామేడ రమ్య, విజయ్‌, తారక రఘువీర్‌, నామెడ గజేంధర్‌, ద్యావత్‌ సోమేష్‌, పూసపత్రి రవితో పాటు తదితరులు పాల్గొన్నారు. 

ట్రిపుల్‌ ఐటీలో మౌలిక సదుపాయాలకు చిత్తశుద్ధితో కృషి

బాసర ట్రిపుల్‌ ఐటీ విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాయాల కల్పనకు, నాణ్యమైన విద్యాబోధనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్‌ పట్టణంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని బాసర ట్రిపుల్‌ ఐటీ ఇన్‌చార్జీ వీసీ వెంకటరమణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాసర విశ్వ విద్యాలయంలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చేందుకు తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుతం జరుగుతున్న పలు అభివృద్ది పనులు, క్యాంటీన్‌ నిర్వహణ, ఆహారనాణ్యత, భోధన, భోధనేతర అంశాల గురించి వీసీ వెంకటరమణ మంత్రికి వివరించారు. సమస్యలు పునరావృతం కాకుండా ప్రణాళికల రూపకల్పన, దశల వారీగా వాటిని అమలు చేయడం విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, కమిటీల ఏర్పాటు తదితర అంశాల గురించి చర్చించారు. విద్యార్థుల భవిష్యత్‌, వారి ప్రయోజనాలే తమకు ముఖ్యమని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే యూనివర్సీటీని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

సాగునీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

సోన్‌ : ఆయకట్టు రైతులు సాగునీటిని సద్వినియోగపర్చుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గాంధీనగర్‌ గ్రామం వద్ద శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి జిల్లాలోని సరస్వతి కాలువ ద్వారా వానకాలం పంటకు 300ల క్యూసెక్కుల సాగు నీటిని విడుదల చేశారు. అంతకుముందు గంగామాతకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వర్షాలు సమృద్ధిగా కురువడంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిగా నిండుకుందని, రెండు పంటలు సాగు చేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ అంపోలి కృష్ణప్రసాద్‌ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మోహినొద్దీన్‌, సర్పంచ్‌లు ఎల్‌చల్‌ గంగారెడ్డి, వినోద్‌కుమార్‌, తదితరులున్నారు. 

ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి

లక్ష్మణచాంద  :మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి సరస్వతికెనాల్‌కు నీటిని విడుదల చేశారు. అనంతరం ప్రాజెక్టు పైనుండి నీటిపై పుష్పాలను వెదజల్లారు. దీనిద్వారా జిల్లాలోని నిర్మల్‌,సోన్‌,లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్‌ మండలాల్లోని పలు గ్రామాల రైతులకు సాగునీటి అవసరాలు తీరను న్నాయి. ముఖ్యంగా ఖరీఫ్‌ సీజన్‌లో కాలువ నీటిపై ఆధారపడి వరినాట్లు వేసే రైతులకు ఎంతో ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ కొరిపెల్లి రామ్‌కిషన్‌రెడ్డి, జడ్పీటీసీ ఓస రాజేశశ్వర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి అడ్వాల రమేష్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల కన్వీనర్‌ కొరిపెల్లి కృష్ణారెడ్డి, నాయకులు పాకాల రాంచందర్‌, తదితరులున్నారు. 

అంత్యక్రియలకు హాజరైన మంత్రి అల్లోల

సారంగాపూర్‌ : మండలంలోని యాకర్‌పెల్లిలో ప్రమాదవశాత్తు లక్ష్మారెడ్డి(55) అనే వ్యక్తి స్వర్ణవాగులో పడి మృతి చెందగా, కౌట్ల(బి)లో అనారోగ్యంతో మృతి చెందిన ఇప్ప భోజారెడ్డి అంత్యక్రియలకు న్యాయ, పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు జిల్లా రైతుబంధు కోఆర్డినేటర్‌ వెంకట్‌రామ్‌రెడ్డి, ఎంపీపీ అట్లమహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డిలతో పాటు నాయకులు రాజ్‌మహ్మద్‌, శ్రీనివాస్‌రెడ్డి, మల్లేష్‌, రామ్‌రెడ్డిలు అంత్య క్రియలకు హాజరయ్యారు.

Updated Date - 2022-08-02T08:46:45+05:30 IST