అభివృద్ధికి పునరంకితం కావాలి

ABN , First Publish Date - 2020-06-03T11:13:32+05:30 IST

నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో మలిదశ ఉద్యమం చేపట్టి 2014 జూన్‌ 2న సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్‌ జిల్లా

అభివృద్ధికి పునరంకితం కావాలి

ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌  

అమరవీరులకు ఘననివాళి

జాతీయ పతాకావిష్కరణ  

నిరాడంబరంగా ఆవిర్భావ వేడుకలు


ఆదిలాబాద్‌టౌన్‌, జూన్‌ 2: నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో మలిదశ ఉద్యమం చేపట్టి 2014 జూన్‌ 2న సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు పునరంకితం కావాలని ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవి ర్భావ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం ఎదుట ఉన్న అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం జడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, ఎస్పీలతో కలిసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఎన్టీఆర్‌చౌక్‌లోని తెలంగాణ తల్లి, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు.


తిరిగి కలెక్టర్‌ కార్యాలయ ఆవరణ లో నిర్వహించిన అధికారిక ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. అనంతరం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మలివిడత ఉద్యమం చేపట్టి స్వరాష్ర్టాన్ని సాధిం చడం జరిగిందన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాసంక్షేమం కోసం అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టి ముందుకు వెళ్తున్నార న్నారు. రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులకు, విడోలకు పింఛన్లు అందించడమే కాకుండా వేలాది ఎకరాలను సస్య శ్యామలం చేయాలని రైతులకు బాసటగా నిలిచేం దుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు. అంతటితో ఆగకుండా కొండ పొచమ్మ ప్రాజెక్టును ఏర్పాటు చేసి కాళే శ్వరం ప్రాజెక్టు నుంచి 618 మీటర్ల ఎత్తుకు నీళ్లను తీసు కెళ్లి పంటల సాగుకు అందించిన ఘనత ముఖ్యమంత్రి దేనని కొనియాడారు.


కాగా, ప్రభుత్వం చేపడుతున్న సంక్షే మ పథకాలను వివరిస్తూ సమాచార శాఖ ఆధ్వర్యంలో కళాజాతా బృందం పాడిన పాటలు అతిథులను ఆకట్టుకు న్నాయి. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, డీసీసీబీ చైర్మన్‌ కాంబ్లె నాందెవ్‌, ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆరే. రాజన్న, కలెక్టర్‌ శ్రీదేవసేన, ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, డేవిడ్‌, డీఆర్‌వో నటరాజ్‌, ఆర్డీవో సూర్యనారాయణ, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులున్నారు. 


తెలంగాణ ఉద్యమకారుడి అరెస్టు..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లక్ష్యంతో చేపట్టిన మలివిడత ఉద్యమంలో ఎన్నో ఏళ్లుగా పాల్గొన్న తనను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఉద్యమకారుడు రామోజీ ఆంజనేయులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనకు ప్రభుత్వం అన్యాయం చేసిం దని, ఉద్యమాన్ని విమర్శించి మాట్లాడిన వారికి పదవులు కట్టబెట్టిందని ఆరోపించారు. మంగళవారం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ రాష్ట్ర ఆవిర్భవ వేడుకలకు జిల్లా కేంద్రం లోని అమరవీరుల స్థూపానికి చేరుకునే ముందు ఆంజనే యులు తెలంగాణచౌక్‌లో నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆంజనేయులును అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.


Updated Date - 2020-06-03T11:13:32+05:30 IST