Abn logo
Sep 17 2021 @ 22:26PM

మోదీతోనే దేశాభివృద్ధి

ఏరియా ఆసుపత్రిలో రొట్టెలు, పండ్లు అందజేస్తున్న బీజేపీ నాయకులు

గూడూరు, సెప్టెంబరు 17: ప్రధాని నరేంద్రమోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ పట్టణాధ్యక్షుడు ఆరికట్ల బాలకృష్ణమనాయుడు అన్నారు. శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా స్థానిక బీజేపీ కార్యాలయంలో కేక్‌కట్‌ చేసి, ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేసి, నరసింగరావుపేటలోని కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రంలో వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం నరేంద్రమోదీ పాటుపడుతున్నారన్నారు. కార్యక్రమంలో పనబాక కోటేశ్వరరావు, దువ్వూరు గిరిధర్‌రెడ్డి, కోటారెడ్డి, పురుషోత్తమరెడ్డి, బిందురెడ్డి, చెంచురెడ్డి, ఇండ్ల హేమచంద్ర, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక సంగం థియేటర్‌ హీరాబన్‌ మాతాజీ గ్లోబల్‌ట్రస్ట్‌ అధ్యక్షుడు కంకణాల పెంచలనాయుడు ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. 

వెంకటగిరి: పట్టణంలోని సచివాలయాల్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌ కేంద్రాలను  మాజీ మున్సిపల్‌ చైర్మన్‌, బీజేపీ జిల్లా ఎస్‌సీ మోర్చా అధ్యక్షుడు అల్లం చంద్రమోహన్‌ పరిశీలించారు. నాయకులు వడ్లమూడి భాస్కర్‌, వయ్యావూరు వెంకటరమణయ్య, అలమంద శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.