అభివృద్ధి పనులను మార్చిలోగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-01-29T03:38:08+05:30 IST

ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను మార్చి 31లోగా పూర్తి చేసేం దుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, పంచాయతీ అధికారి నారాయణతో కలిసి మండల పరిషత్‌, పంచాయతీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

అభివృద్ధి పనులను మార్చిలోగా పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 28: ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను మార్చి 31లోగా పూర్తి చేసేం దుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, పంచాయతీ అధికారి నారాయణతో కలిసి మండల పరిషత్‌, పంచాయతీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పనుల నిర్వహణకు మంజూరైన మెటీ రియల్‌ కంపోనెంట్‌ మొత్తాన్ని వినియోగించుకుని పనులను చేపట్టాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఐదు వరికళ్లాలను నిర్మించాలని సూచించారు. హరితహారంలో భాగంగా చేపట్టిన నర్సరీల్లో అన్ని పనులను పూర్తి చేయడంతోపాటు నాటిన ప్రతి మొక్కకు ట్రీగార్డును ఏర్పాటు చేసి పరిరక్షించాలన్నారు.  సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 

పారిశుధ్య పనులపై దృష్టి పెట్టాలి 

జైపూర్‌: పారిశుధ్య పనులపై పంచాయతీ సిబ్బంది దృష్టి పెట్టాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ పేర్కొన్నారు.  ఇందారంలో పలు అభివృద్ధి పనులను  పరిశీలించారు. గ్రామం లో పలు వీధుల్లో పర్యటించి పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని కార్యదర్శికి సూచించారు. గ్రామంలో చేపట్టిన పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, డంపింగ్‌యార్డు పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీడీవో కే. నాగే శ్వర్‌రెడ్డి, పంచాయతీ అధికారి సతీష్‌కుమార్‌ ఉన్నారు. 

భీమారం: గ్రామాల్లో పారిశుధ్య పనులను పకడ్బందీగా నిర్వ హించాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. మండల కేంద్రంతో పాటు ఎల్కేశ్వరంలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. సేకరించిన చెత్తను పారిశుధ్య కార్మికు లకు అందించాలన్నారు. ఎల్కేశ్వరంలోని పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి మొక్కలను సంరక్షించాలని సూచించారు. గ్రామాల్లో వంద శాతం వ్యాక్సిన్‌ పూర్తయ్యేలా సర్పంచులు, కార్యదర్శులు కృషి చేయాలని, ఇంటి పన్నులను వంద శాతం వసూలు చేయా లన్నారు.  మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు, సర్పంచులు రాంరెడ్డి, సమ్మయ్య  ఉన్నారు. 

Updated Date - 2022-01-29T03:38:08+05:30 IST