భౌతిక దూరంపై అప్రమత్తం చేసే పరికరం

ABN , First Publish Date - 2020-07-10T07:54:01+05:30 IST

భౌతిక దూరంపై అప్రమత్తం చేసే ఓ అద్భుత పరికరాన్ని ఎన్‌.నిధీజ్‌ అనే రైల్వే ఇంజనీర్‌ ఆవిష్కరించారు. ఆయన ప్రస్తుతం తిరువనంతపురం డివిజన్‌లో సిగ్నల్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్స్‌ విభాగంలో జూనియర్‌ ఇంజనీర్‌గా విధులు...

భౌతిక దూరంపై అప్రమత్తం చేసే పరికరం

న్యూఢిల్లీ, జూలై 9: భౌతిక దూరంపై అప్రమత్తం చేసే ఓ అద్భుత పరికరాన్ని ఎన్‌.నిధీజ్‌ అనే రైల్వే ఇంజనీర్‌ ఆవిష్కరించారు. ఆయన ప్రస్తుతం  తిరువనంతపురం డివిజన్‌లో సిగ్నల్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్స్‌ విభాగంలో జూనియర్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కేవలం 30గ్రాముల బరువుంటే ఈ చిన్న పరికరాన్ని పర్సులో ఐడీ కార్డుల వంటి వాటితో లేదా రిస్ట్‌వాచీకి జతచేసి వినియోగించుకోవచ్చు. భౌతిక దూరం మూడు మీటర్లలోపు ఉంటే ఈ పరికరం అలారం మోగిస్తుంది. కాగా, అలా్ట్రసౌండ్‌ సెన్సార్లు, మైక్రో కంట్రోలర్లను ఉపయోగించి ఒక స్వయంచాలిత శానిటైజర్‌ డిస్పెన్సర్‌ను కూడా నిధీజ్‌ అభివృద్ధి చేశారు. ఈ శానిటైజర్‌ డిస్పెన్సర్‌ కింద చేయి పెడితే 0.75సెకన్లపాటు శానిటైజర్‌ను వెదజల్లుతుంది.  


Updated Date - 2020-07-10T07:54:01+05:30 IST