గాలి నాణ్యత కొలిచే పరికరం

ABN , First Publish Date - 2020-08-15T07:33:26+05:30 IST

గాలిలోని కాలుష్యాన్ని గుర్తించి, గాలి నాణ్యతను కొలిచే రియల్‌టైమ్‌ రిమోట్‌ మానిటరింగ్‌ పరికరాన్ని విశాఖపట్నంలోని గాయత్రి విద్యా పరిషత్‌ సైంటిఫిక్‌, ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ సెంటర్...

గాలి నాణ్యత కొలిచే పరికరం

న్యూఢిల్లీ, ఆగస్టు 14: గాలిలోని కాలుష్యాన్ని గుర్తించి, గాలి నాణ్యతను కొలిచే రియల్‌టైమ్‌ రిమోట్‌ మానిటరింగ్‌ పరికరాన్ని విశాఖపట్నంలోని గాయత్రి విద్యా పరిషత్‌ సైంటిఫిక్‌, ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (జీవీపీఈ-ఎ్‌సఐఆర్‌సీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ విషయాన్ని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం (డీఎ్‌సటీ) శుక్రవారం వెల్లడించిం ది. ఎయిర్‌ యూనిక్‌ క్వాలిటీ మానిటరింగ్‌ (ఏయూఎం)గా పిలిచే ఈ పరికరాన్ని పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినట్టు తెలిపింది. ఈ పరికరం ఏకకాలంలో గాలిలోని కాలుష్య కారకాలను, వాతావరణ పారామితులను గుర్తించగలదు. 

Updated Date - 2020-08-15T07:33:26+05:30 IST