అప్పన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2020-09-20T09:11:15+05:30 IST

సింహాద్రి అప్పన్న స్వామి దర్శనానికి శనివారం సుమారు పదివేల మంది భక్తులు తరలిరావడంతో సింహగిరి పరిసరాల్లో రద్దీ వాతావరణం నెలకొంది. వేకుమజాము నుంచే కొండదిగువ శ్రీదేవి సత్రంలోని టికెట్ల

అప్పన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

శనివారం ఒక్కరోజే రూ.పది లక్షల ఆదాయం


సింహాచలం, సెప్టెంబరు 19: సింహాద్రి అప్పన్న స్వామి దర్శనానికి శనివారం సుమారు పదివేల మంది భక్తులు తరలిరావడంతో సింహగిరి పరిసరాల్లో రద్దీ వాతావరణం నెలకొంది. వేకుమజాము నుంచే కొండదిగువ శ్రీదేవి సత్రంలోని టికెట్ల కౌంటర్ల వద్ద భక్తులు బారులుతీరారు.


దీంతో శనివారం ఒక్కరోజే రూ.300, రూ.100 టికెట్ల విక్రయాల ద్వారా సుమారు రూ.ఆరు లక్షలు, తలనీలాలు, రూ.25 టికెట్ల ద్వారా రూ.45 వేలు, ప్రసాదాల విక్రయాల ద్వారా సుమారు 3.5 లక్షలు కలిపి సుమారు రూ.పది లక్షల వరకు అప్పన్న ఖజానాకు ఆదాయం లభించింది. 

Updated Date - 2020-09-20T09:11:15+05:30 IST