మద్యం దుకాణాలు మూసివేయాలని ధర్నా

ABN , First Publish Date - 2020-08-05T10:14:54+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కంటైన్మెంట్‌ జోన్‌ల్లో ప్రభుత్వం వైన్‌షాపులు తెరిచి మద్యం ..

మద్యం దుకాణాలు మూసివేయాలని ధర్నా

చిట్టినగర్‌/పాయకాపురం/అజిత్‌ిసంగ్‌నగర్‌, ఆగస్టు 4: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కంటైన్మెంట్‌ జోన్‌ల్లో ప్రభుత్వం వైన్‌షాపులు తెరిచి మద్యం విక్రయించడం కరోనా ఉధృతిని పెంచడమేనని ఐద్వా జిల్లా కార్యదర్శి శ్రీదేవి దుయ్యబట్టారు. మద్యం షాపులు మూసివేయాలని కోరుతూ ఐద్వా విజయవాడ పశ్చిమ నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నెహ్రూబొమ్మసెంటర్‌లో మహిళలు ధర్నా నిర్వహించారు.


శ్రీదేవి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో కరోనా కేసులు ఎక్కువగా ఉంటే ప్రభుత్వం మద్యం షాపులు తెరవడం దారుణమన్నారు. ఐద్వా పశ్చిమ నగర అధ్యక్ష, కార్యదర్శులు గాదె ఆదిలక్ష్మి, గర్రె పాలవల్లి, వెంకటరత్నం పాల్గొన్నారు. నగర శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేయాలని కోరుతూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మహిళలతో రాధానగర్‌లో ధర్నా నిర్వహించారు.  58వ డివిజన్‌ అజిత్‌సింగ్‌నగర్‌లో మంగళవారం ఐద్వా, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యాన లిక్కర్‌ దుకాణాలు మూసివేయాలని కోరుతూ ధర్నా చేశారు. 

Updated Date - 2020-08-05T10:14:54+05:30 IST