మునిసిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2020-12-04T05:24:26+05:30 IST

మునిసిపల్‌ ఉద్యోగుల, కార్మికుల సమ స్యలు పరిష్కరించాలని కోరుతూ మునిసిపల్‌ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సీఐటీయూ, ఏఐటీ యూసీ, ఐఎఫ్‌టీయూ సంఘాల ఆధ్వర్యంలో మునిసిపల్‌ కార్మికులు గురు వారం ధర్నా నిర్వహించారు.

మునిసిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించండి
కార్మికుల ధర్నా

ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా

ఏలూరు టూటౌన్‌, డిసెంబరు 3 : మునిసిపల్‌ ఉద్యోగుల, కార్మికుల సమ స్యలు పరిష్కరించాలని కోరుతూ మునిసిపల్‌ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సీఐటీయూ, ఏఐటీ యూసీ, ఐఎఫ్‌టీయూ సంఘాల ఆధ్వర్యంలో మునిసిపల్‌ కార్మికులు గురు వారం ధర్నా నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన మునిసిపల్‌ ఉద్యో గులు, కార్మికులు, స్కూల్‌ స్వీపర్లు ఈ ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నాను ఉద్దేశించి మునిసిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సోమయ్య, మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భజంతి శ్రీనివాస్‌, ఐఎఫ్‌టీయూ నగర ప్రధా న కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ మునిసిపల్‌ ఉద్యోగులు, కార్మికు లు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రధానంగా పబ్లిక్‌ హెల్త్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు నాలుగు మాసాలుగా హెల్త్‌ అలవెన్సులు రాక ఇబ్బంది పడుతున్నారన్నారు. మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం కార్మి కులు, మునిసిపల్‌ స్కూల్స్‌ స్వీపర్లు మూడు మాసాలుగా జీతాలు లేక అల్లాడుతున్నారన్నారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధర్నాలో ఏలూరు జూట్‌మిల్లు యూ నియన్‌ సీఐటీయూ అధ్యక్షుడు బి.జగన్నాఽథరావు, సీఐటీయూ, ఏఐటీ యూసీ, ఐఎఫ్‌టీయూ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం మునిసి పల్‌ అడిషనల్‌ కమిషనర్‌ బాపిరాజుకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.

Updated Date - 2020-12-04T05:24:26+05:30 IST