ఘనంగా పశు సంక్రాంతి

ABN , First Publish Date - 2022-01-22T16:30:36+05:30 IST

నార్సింగ్‌ వ్యవసాయ మార్కెట్‌లో పశువుల సంత (పశుసంక్రాంతి) జోరుగా సాగింది. సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి శుక్రవారం సంబురం నిర్వహిస్తారు...

ఘనంగా పశు సంక్రాంతి

ధూలియా జాతి గేదె రూ. 2.5లక్షలు

హైదరాబాద్/నార్సింగ్‌: నార్సింగ్‌ వ్యవసాయ మార్కెట్‌లో పశువుల సంత (పశుసంక్రాంతి) జోరుగా సాగింది.   సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి శుక్రవారం సంబురం నిర్వహిస్తారు.  ఈసారి పలు రాష్ట్రాల నుం చి గేదెలు వచ్చినప్పటికీ కరోనా కారణంగా మార్కెట్‌ మందకొడిగా సాగింది. అయితే ధర ఏ మాత్రం తగ్గలేదు. ఈసారి రికార్డుస్థాయిలో ధూలియా గేదె రెండున్నర లక్షలకు అమ్ముడుపోయింది. నార్సింగ్‌కు చెందిన మహ్మద్‌ఖాజా తన గేదెను ఎనక్కపల్లి అశోర్‌రెడ్డికి రూ. 2.5లక్షలకు  విక్రయించారు. ఈ గేదె రోజూ ఇరవై లీటర్ల కంటే అధికంగా పాలు ఇస్తుందని, కనీసం ఏడు నెలల పాటు పాలు ఇస్తుందని మహ్మద్‌ఖాజా తెలిపారు.


ఇదే మార్కెట్‌లో జాఫ్రీ జాతికి చెందిన గేదెలను రూ.2.10 లక్షల చొప్పున మహ్మద్‌ఖాజా మరికొందరికి విక్రయించారు. నార్సింగ్‌కు చెందిన రైతు రాజిరెడ్డి సతీ్‌షరెడ్డి తన హరియాణా గుజ్జర్‌ జాతి  గేదెను రూ.2.01 లక్షలకు అనూ్‌పయాదవ్‌ అనే పాల వ్యాపారికి  విక్రయించారు. ఏడాది క్రితం ధూలియా గేదె రెండు లక్షలకు అమ్ముడు పోగా ఈసారి రూ. వెయ్యి ధర పెరిగింది. కరోనాతోపాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సరిగా లేకపోవడంతో మార్కెట్‌పై ప్రభావం పడింది. చాలావరకు గేదెలు లక్ష నుంచి లక్షా పది వేల వరకు అమ్ముడు పోయాయి. ధూలియా, గుజ్జర్‌ హరియాణా, సోలాపూర్‌, ముర్రా గేదెలకు డిమాండ్‌ కనిపించింది. ఇక పుంగనూర్‌, గుజరాత్‌కు చెందిన ఆవులు 70 వేల నుంచి లక్షన్నర వరకు అమ్ముడుపోయాయి. 


బంగార్రాజు.. వచ్చాడు

పశుసంక్రాంతిలో నార్సింగ్‌ కౌన్సిలర్‌ పత్తిశ్రీకాంత్‌ మెరిశారు. నిత్యం బంగారు నగలతో కనిపించే ఆయన రెండు భారీ పూల దండలు మాదిరి బంగారు దండలు వేసుకుని మార్కెట్‌ అంతా తిరుగుతూ బంగార్రాజుగా హంగామా చేశారు. దీంతో చాలామంది శ్రీకాంత్‌తో సెల్ఫీలు దిగారు. 

Updated Date - 2022-01-22T16:30:36+05:30 IST