మహిళా రక్షణ చర్యలపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2021-07-30T06:03:23+05:30 IST

మహిళల రక్షణకు, భద్రతకు పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని డీఐజీ త్రివిక్రమవర్మ గ్రామ, వార్డు మహిళా పోలీసులకు సూచించారు.

మహిళా రక్షణ చర్యలపై అవగాహన కల్పించాలి
నందిగాంలో పోలీసులతో మాట్లాడుతున్న ఐజీ త్రివిక్రమవర్మ

మహిళా పోలీసులకు డీఐజీ త్రివిక్రమశర్మ సూచన

సత్తెనపల్లి రూరల్‌, జూలై 29: మహిళల రక్షణకు, భద్రతకు పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని డీఐజీ త్రివిక్రమవర్మ గ్రామ, వార్డు మహిళా పోలీసులకు సూచించారు. మండలంలోని నందిగాం గ్రామంలో గురువారం మహిళా పోలీసులు, ఏఎన్‌ఎంలు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. క్షేత్రస్థాయిలో మహిళల సమస్యలను పరిష్కరించాల్సింది గ్రామ పోలీసులే అన్నారు. పోలీసుశాఖ వెన్నంటి ఉంటుందని, నిర్భయంగా విధులు నిర్వహించాలని మహిళా పోలీసులకు సూచించారు. దిశ యాప్‌పై మహిళల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. విధి నిర్వహణలో ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో రూరల్‌ఎస్పీ విశాల్‌గున్నీ, డీఎస్పీ విజయ్‌భాస్కర్‌రెడ్డి, సీఐలు నరసింహరావు,   రఘుపతి, రూరల్‌ ఎస్‌ఐ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-30T06:03:23+05:30 IST