ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన డైరెక్టర్లు, ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-07-31T04:07:31+05:30 IST

పట్టణంలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాం టును శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గంచిన్నయ్య, సింగరేణి డైరెక్టర్లు, బలరాం, సత్యనారాయణరావు, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావు ప్రారంభించారు. ఈ సంద ర్భంగా సింగరేణి డైరెక్టర్లు మాట్లాడుతూ బెల్లంపల్లిలో 90మంది రోగులకు, గోదావరి ఖనిలో 150మంది రోగులకు ఆక్సిజన్‌ అందించే సామర్థ్యం గల ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఆక్సిజన్‌  ప్లాంట్‌ను ప్రారంభించిన డైరెక్టర్లు, ఎమ్మెల్యే
బెల్లంపల్లిలో ఆక్సిజన్‌ ప్లాంటును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే, సింగరేణి డైరెక్టర్లు

బెల్లంపల్లి, జూలై 30 : పట్టణంలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాం టును శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గంచిన్నయ్య, సింగరేణి డైరెక్టర్లు, బలరాం, సత్యనారాయణరావు, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావు ప్రారంభించారు. ఈ సంద ర్భంగా సింగరేణి డైరెక్టర్లు మాట్లాడుతూ బెల్లంపల్లిలో 90మంది రోగులకు, గోదావరి ఖనిలో 150మంది రోగులకు ఆక్సిజన్‌ అందించే సామర్థ్యం గల ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను నియమించేందుకు యాజమాన్యం చొరవ చూపాలన్నారు. ఈ సందర్భంగా మొక్కలను నాటారు.

మందమర్రి: మందమర్రిలోని రామకృష్ణాపూర్‌ ఏరియా ఆస్పత్రిఆవరణలో 35లక్ష లతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను శుక్రవారం సింగరేణి డైరెక్టర్‌(పా) బలరాం, డైరెక్టర్‌(ఈఅండ్‌ఎం) సత్యనారాయణ ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కార్మికులసంక్షేమంలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా 5ఆక్సిజన్‌ ప్లాంట్‌ లను ఏర్పాటు చేశామని అన్నారు. వీటిలో ఇప్పటికే మూడు ప్లాంట్‌లను ప్రారంభించు కున్నామని తెలిపారు. ఇంకా రెండు ప్లాంట్‌లను ప్రారంభించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో టీబీజీకెఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావ్‌, జీఎం పర్సనల్‌ కార్పొరేట్‌ ఆనంద రావు, మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్‌, శ్రీరాంపూర్‌ జీఎం సురేష్‌, ఏజీఎం ఈఅండ్‌ ఎం జగన్‌మోహన్‌ రావు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-31T04:07:31+05:30 IST