18 మంది వార్డుసభ్యుల తొలగింపు

ABN , First Publish Date - 2021-01-16T05:25:06+05:30 IST

స్థానిక ఎన్నికల్లో జమ ఖర్చులు చూపని మండలానికి చెందిన 18మంది వార్డు సభ్యులను తొలగించినట్లు నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి ఎంపీడీఓ యాదగిరిగౌడ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

18 మంది వార్డుసభ్యుల తొలగింపు

పెద్దఅడిశర్లపల్లి, జనవరి15: స్థానిక ఎన్నికల్లో జమ ఖర్చులు చూపని  మండలానికి చెందిన 18మంది వార్డు సభ్యులను తొలగించినట్లు నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి ఎంపీడీఓ యాదగిరిగౌడ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరు మూడు సంవత్స రాలపాటు ఏ ఎన్నికల్లోనూ పాల్గొనడానికి అర్హులు కారని తెలిపారు. అంగడి పేట ఎక్స్‌రోడ్డు గ్రామపంచాయతీలో ముగ్గురు, చింతల్‌తండా ఒకరు, పీఏప ల్లిలో ఒకరు, పోల్కంపల్లిలో నలుగురు, రాంపురంలో నలుగురు, తిరుమ లగిరిలో నలుగురు, ఎర్రగుంటతండా గ్రామపంచాయతీకి చెందిన ఒక వార్డు సభ్యుడిని తొలగించినట్లు ఎంపీడీవో తెలిపారు. 


Updated Date - 2021-01-16T05:25:06+05:30 IST