చేనేత పేదలకు ఆపన్న హస్తం

ABN , First Publish Date - 2021-06-22T04:31:14+05:30 IST

మండలంలో కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న పలు చేనేత పేద కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్‌ చేనేత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం

చేనేత పేదలకు ఆపన్న హస్తం

సంగం, జూన్‌ 21: మండలంలో కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న పలు చేనేత పేద కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్‌ చేనేత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం అపన్న హస్తం అందచేశారు. కొత్తూరు, రాళ్లచెలిక, తిరుమనతిప్ప, శ్రీనివాసపురం తదితర వీవర్స్‌ కాలనీల్లో పనులు లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలను గుర్తించి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర కిట్‌లను అందచేశారు. ఈ కార్యక్రమంలో చేనేత ఉద్యోగ సంఘం నాయకులు బివి రత్నం, మోహన్‌రావు, మురళి, వెంకటేశ్వర్లు, నాగ నరిసింహులు, నరేంద్ర, గిరి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T04:31:14+05:30 IST