Abn logo
Oct 24 2020 @ 06:43AM

కొనసాగుతున్న రేషన్‌ కష్టాలు

నాలుగు రోజుల్లో 30.90 శాతం మాత్రమే పంపిణీ

వేధిస్తున్న సర్వర్‌ సమస్య 

కార్డుదారుల ఇక్కట్లు


ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 23 : జిల్లాలో రేషన్‌ పంపిణీకి కష్టాలు కొనసాగుతున్నాయి.  గత నాలుగు  రోజుల నుంచి రేషన్‌షాపుల వద్ద ఇదే పరిస్థి తి కొనసాగుతున్నది. సాధారణంగా ప్రతి రోజు 15నుంచి 20శాతం మంది కార్డు దారులకు సరుకులు ఇవ్వాల్సి ఉండగా నాలుగు  రోజులకు కలిపి కేవలం 30.90 శాతం మంది కార్డుదారులకు సరుకులు అందాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నెలకు రెండు పర్యాయాలు కార్డుదారులకు ఉచితంగా రేషన్‌ పంపిణీ ప్రకటించింది. అం దుకు అనుగుణంగా  జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి 14వ విడత బి య్యం, శనగలు పంపిణీ ప్రారంభమైంది. 


   అయితే సర్వర్‌ డౌన్‌ కావడంతో కార్డుదారులు గంటల తరబడి రేషన్‌ షాపుల వద్దనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించకుండా ఇష్టానుసారంగా మార్పులు, చేర్పులు చేస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు రేషన్‌షాపుల వద్ద కార్డుదారుడు ఒకసారి వేలి ముద్ర వేస్తే బియ్యం, కందిపప్పు, చెక్కర, ఇతర వస్తువులు ఇచ్చేవారు. అయితే ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ఒక్కో వస్తువుకు ఒక్కొక్కసారి కార్డుదారులు వేలిముద్రలు వేయాల్సి వస్తోంది. దీంతో సరుకుల పంపిణీ మరింత ఆలస్య మవుతోంది. దీనివల్ల కార్డుదారులు ఇక్కట్లు పడుతున్నారు.

Advertisement
Advertisement