మూడుచక్రాల సైకిల్‌ కోసం రూ.8500 వితరణ

ABN , First Publish Date - 2021-10-25T05:07:47+05:30 IST

భిక్షాటన చేస్తున్న ఓ వృద్ధుడి దీనావస్థ ను చూసి వేముల మాజీ ఉప మండలాధ్యక్షుడు, వైసీపీ మం డల పరిశీలకుడు లింగాల రామలింగారెడ్డి రూ.8500 నగదు అందించారు.

మూడుచక్రాల సైకిల్‌ కోసం రూ.8500 వితరణ
వృద్ధుడికి నగదు అందిస్తున్న రామలింగారెడ్డి

వేముల, అక్టోబరు 24: భిక్షాటన చేస్తున్న ఓ వృద్ధుడి దీనావస్థ ను చూసి వేముల మాజీ ఉప మండలాధ్యక్షుడు, వైసీపీ మం డల పరిశీలకుడు లింగాల రామలింగారెడ్డి రూ.8500 నగదు అందించారు. ఆదివారం లక్కిరెడ్డిపల్లె వద్ద కుర్నూతల గంగ మ్మ దర్శనానికి వెళ్లారు. అక్కడే భిక్షాటన చేస్తున్న వృద్ధుడిని చూసి చలించిన ఆయన వెంటనే మూడు చక్రాల సైకిల్‌ తెచ్చుకోవాలని నగదు అందించారు. ఈ సందర్భంగా వృద్ధుడికి చేసిన సహాయానికి స్థానికులు, భక్తులు ఆయనకు అభినంద లు తెలిపారు. 


Updated Date - 2021-10-25T05:07:47+05:30 IST