Advertisement
Advertisement
Abn logo
Advertisement

త్రివేణిలో చెకుముకి సంబరాలు

త్రివేణిలో చెకుముకి సంబరాలు

పటమట, నవంబరు 29: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో త్రివేణి కళాశాలలో సోమవారం జిల్లా స్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్‌ స్వామి పాల్గొన్నారు. సంబరాలలో భాగంగా నిర్వహించిన చెకుముకి పోటీల్లో ఏ కొండూరు జడ్పీ హైస్కూల్‌కు చెందిన పి. హర్షవర్ధన్‌, కె. ఉపేంద్ర, పి. రాజేష్‌లు ప్రథమ, గానుగపాడు జడ్పీ హైస్కూల్‌కు చెందిన ఎం శ్రీజ, ఏ గౌతమి, షేక్‌ రిజ్వానాలు ద్వితీయ, పెదవుటపల్లి సాయి శ్రీనివాస్‌ హైస్కూల్‌కు చెందిన యూ. కీర్తి, ఆర్‌ ప్రవీణ్‌ పట్నాయక్‌, షేక్‌ మస్తాన్‌ వలీలు తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు మురళీ మోహన్‌, త్రివేణి డైరెక్టర్‌ సాంబిరెడ్డి, రాష్ట్ర, జిల్లా చెకుముకి కన్వీనర్లు ఎం. హరికృష్ణ, కన్వీనర్‌ షేక్‌ ఇమామ్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement