దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో జీవించాలి

ABN , First Publish Date - 2021-12-04T04:48:34+05:30 IST

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో జీవించాలని ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ అన్నారు.

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో జీవించాలి
దివ్యాంగులకు కృత్రిమ కాలు అమర్చిన దృశ్యం

ప్రొద్దుటూరు టౌన్‌ డిసెంబరు 3: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో జీవించాలని ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ అన్నారు. శుక్రవారం పీఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆల్‌ ఇండి యా జైన్‌ యూత్‌ ఫెడరేషన్‌ మహావీర్‌ లింబ్‌ సెంటర్‌ సహకారంతో 125 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అమర్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ దాతల సహకారంతో కృత్రిమ అవ యవాలను అమర్చడం ఆనందదాయకమన్నారు. దివ్యాంగులు కృత్రిమ అవ యవాల వల్ల తమ కాళ్లపై తాము నిలబడే అవకాశం ఏర్పడింద న్నారు. ఈ అవయవాల వల్ల వారిలో సంతృప్తి, ఆత్మస్థైర్యం కలుగుతుందన్నారు. మానవత సంస్థ కార్యాలయం ఏర్పాటుకు స్థలం మంజూరు చేయడానికి కృషి చేస్తానన్నారు.  మానవత సంస్థ చైర్‌పర్సన్‌ కళావతి మాట్లాడుతూ దివ్యాంగులకు మరిన్ని సేవలు అందిస్తామన్నారు. దాతల సహకారంతో కృత్రిమ అవయవాల ఏర్పా టు కార్యక్రమం  విజయవంత మైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహావీర్‌ లింబ్‌ సెంటర్‌ చైర్మన్‌ డాక్టర్‌  మహేంద్రసింగ్వీ, టీటీడీ పాలకమండలి సభ్యుడు టంగుటూరు మా టటరుతి ప్రసాద్‌, చిన్మయ మిషన్‌ నిర్వాహకురాలు రచన చైతన్య, మానవత సంస్థ కో చైర్మన్‌ రామచంద్రుడు, అధ్యక్షుడు చిట్టెం రమేష్‌, కన్వీనర్‌ నరసింహులు, డాక్టర్‌ నాగలక్ష్మి, శ్రీధర్‌, వెంకటరామిరెడ్డి, గోపి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-04T04:48:34+05:30 IST