నర్సరీల నిర్వహణపై అలసత్వం వద్దు

ABN , First Publish Date - 2020-12-04T05:45:22+05:30 IST

నర్సరీల నిర్వహణపై అలసత్వం వహించద్దని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. గురువారం మండలంలోని భోస్రా, దిగ్నూర్‌, గంగాపూర్‌, జాతర్ల, బజార్‌హత్నూర్‌, గ్రామపంచాయతీల పరిధిలో నర్సరీల నిర్వహణ, పల్లెప్రకృతి వనాలను, క్రిమిటోరియం, సెగ్రిగేషన్‌ పనులను పరిశీలించారు.

నర్సరీల నిర్వహణపై అలసత్వం వద్దు
భోస్రాలో నర్సరీ పనులను పరిశీలిస్తున్న అదనపు కల్టెర్‌ డేవిడ్‌

బజార్‌హత్నూర్‌, డిసెంబరు 3: నర్సరీల నిర్వహణపై అలసత్వం వహించద్దని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. గురువారం మండలంలోని భోస్రా, దిగ్నూర్‌, గంగాపూర్‌, జాతర్ల, బజార్‌హత్నూర్‌, గ్రామపంచాయతీల పరిధిలో నర్సరీల నిర్వహణ, పల్లెప్రకృతి వనాలను, క్రిమిటోరియం, సెగ్రిగేషన్‌ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల పెం పకాన్ని గ్రామపంచాయతీల పరిధిలో నర్సరీలకు అప్పగించిందని, మొక్కల పెరుగుదల వాటి సంరక్షణ బాధ్యతలను ప్రణాలికా బద్ధంగా తీసుకోవాలని నర్సరీల నిర్వాహకులకు సూచించారు. మొక్కల పెంపకానికి ఉపయోగించే మట్టిలో కావల్సిన మోతా దులో ఎరువులను కలిపి కవర్లలో నింపాలని అపుడే మొక్కలు ఆరోగ్యకరంగా ఎదగుతాయని సూచిం చారు. అనంతరం జాతర్ల గ్రామంలోని పల్లెప్రకృతి వనాన్ని సందర్శించారు. డీఆర్డీవో రాథోడ్‌ రాజేశ్వర్‌ మాట్లాడుతూ నర్సరీల  నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తం ఈజీఎస్‌ నుంచి అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దుర్గం శంకర్‌, ఎంపీవో మహేందర్‌ రెడ్డి, ఏపీవో శ్రీనివాస్‌, సర్పంచులు నందీశ్వర్‌, పెందుర్‌ లక్ష్మి, ఎంపీటీసీ గజానంద్‌, కార్యదర్శులు సాయిప్రసాద్‌, శ్రీకాంత్‌, రెడ్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:45:22+05:30 IST