నిర్మాణ పనుల్లో అలసత్వం వహించొద్దు

ABN , First Publish Date - 2022-01-18T05:51:07+05:30 IST

రామగుండం మెడికల్‌ కళాశా ల నిర్మాణ పనులు, 85పడకల ఆసుపత్రి నిర్మాణ పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని, వేగవంతంగా నిర్మా ణ పనులు చేపట్టాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అధికారులకు సూచించారు.

నిర్మాణ పనుల్లో అలసత్వం వహించొద్దు
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చందర్‌

- రామగుండం ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం

- ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే చందర్‌

కళ్యాణ్‌నగర్‌, జనవరి 17: రామగుండం మెడికల్‌ కళాశా ల నిర్మాణ పనులు, 85పడకల ఆసుపత్రి నిర్మాణ పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని, వేగవంతంగా నిర్మా ణ పనులు చేపట్టాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అధికారులకు సూచించారు. సోమవారం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ, టీఎస్‌ఐసీ, రెవె న్యూ, మెడికల్‌ కళాశాల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిగ్రీ కళాశాలలో నిర్మించతలపెట్టిన కళాశాల పనులను వేగవంతంగా నిర్మించాలని, అదే విధంగా ఆసుపత్రి ఆవరణలో 85 పడకల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలు అయినా పిల్లర్ల వరకే పూర్తయ్యాయని, టీఎస్‌ఐసీ అధికారులు పనులను నిర్లక్ష్యంగా చేస్తున్నారని, వారు ఇప్పటికైనా పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో మెడికోల కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నామని, భవన నిర్మాణాలు పూర్తికాగానే అన్నీ సౌకర్యాలతో కూడిన కళాశాల, నర్సింగ్‌ కళాశాల, హాస్టల్‌ భవనాల్లోకి మారుస్తామని చెప్పారు. సింగరేణి నిధులతో నిర్మిస్తున్న కళాశాల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకుండా గడువులోగా పూర్తి చేయాలని అధికారులక్సుఊచించారు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న మార్చూరీని మార్చాలని, ఆసుపత్రి చుట్టూ ప్రహారి నిర్మించాలని, ఆసుపత్రి చుట్టూ బౌండరీస్‌ వేయాలని, ఆసుపత్రి లో నిర్వహిస్తున్న డైట్‌ కాంట్రాక్టర్‌ను మార్చాలని, తదితర తీర్మాణాలను చేశారు. ఈ సమీక్ష సమావేశంలో మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌, జెడ్‌పీటీసీ ఆముల నారాయణ, కార్పొరేటర్లు సాగంటి శంకర్‌, బాల రాజ్‌ఖుమార్‌, ఆర్‌ఎంఓ బీష్మతో పాటు ఆర్‌అండ్‌బీ ఇంజనీర్లు, మెడికల్‌ కళాశాల ప్రొఫెసర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-18T05:51:07+05:30 IST