కుటుంబాలు నాశనం చేసుకోవద్దు

ABN , First Publish Date - 2021-06-24T04:51:49+05:30 IST

ఫ్యాక్షన జోలికి వెళ్లి కుటుంబాలను నాశ నం చేసుకోవద్దని పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు సూచిం చారు.

కుటుంబాలు నాశనం చేసుకోవద్దు
కౌన్సెలింగ్‌ ఇస్తున్న డీఎస్పీ శ్రీనివాసులు

ఫ్యాక్షన లీడర్లకు డీఎస్పీ కౌన్సెలింగ్‌ 

లింగాల, జూన 23: ఫ్యాక్షన జోలికి వెళ్లి కుటుంబాలను నాశ నం చేసుకోవద్దని పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు సూచిం చారు. బుధవారం మండలంలో ఏ1 ఫ్యా క్షన గ్రామాలైన అం బకపల్లె, గుణకనపల్లె గ్రామాల ఫ్యాక్షన లీడర్లకు పులివెందులలోని డీఎస్పీ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడు తూ ఫ్యాక్షన జోలికి వెళితే మీరేకాక మీ కుటుంబాలు, మీ పిల్లల చదువులు నాశనమైపోతాయని సూచించారు. ఫ్యాక్షన జోలికి వెళితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ రవీంద్ర నాథరెడ్డి, ఎస్‌ఐ హాజీవలి తదితరులు పాల్గొన్నారు.

వేంపల్లెలో సీఐ సూచనలు...

వేంపల్లె, జూన 23:  గ్రామంలో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సీఐ వెంకటేశ్వర్లు ప్రజలకు సూచించారు. అలవలపా డులో రౌడీషీటర్లు, అనుమానితుల ఇళ్లు, గడ్డివాముల్లో విస్తృతంగా తనిఖీ చేసి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. సీఐ మాట్లాడుతూ సమస్యలను సా మరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలను సద్విని యోగం చేసుకుని పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుని ఫ్యాక్షన ను నిర్మూలించుకోవాలని గ్రామస్థులకు సూచించారు. కార్యక్రమంలో వేంపల్లె, ఆర్కేవ్యాలీ, చక్రాయపేట ఎస్‌ఐలు సుభాష్‌చంద్రబోస్‌, మల్లికార్జునరెడ్డి, కృష్ణమూర్తి,  రఘురాం, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రశాంత వాతావరణంలో జీవించాలి

దువ్వూరు, జూన 23: గ్రామాల్లో విబేధాలు వీడి ప్రశాంత వాతావర ణంలో జీవించాలని మైదుకూరు రూరల్‌ సీఐ పి.వి.కొండారెడ్డి సూచిం చారు. బుధవారం తెల్లవారుజామున ఫ్యాక్షన ప్రభావిత గ్రామాలైన నారాయణపల్లె, మదిరేపల్లెల్లో నాకాబందీ నిర్వహించారు. ప్రతి ఇంటి నీ సోదా చేసి ఇరువర్గాల వారికీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఘర్షణలకు పా ల్పడకుండా ప్రశాంతంగా జీవించాలని సమస్యల జ్యోలికి వెళ్లవద్దని సూచించారు. అనవసరంగా గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2021-06-24T04:51:49+05:30 IST